close
Choose your channels

రకుల్ ను సిఫార్సు చేసిన కాజల్

Saturday, January 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇటీవ‌లే క‌థానాయిక‌గా 50 సినిమాలను పూర్తిచేసుకుంది అందాల న‌టి కాజల్ అగర్వాల్. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్ళు గడచినా...ఇంకా కొత్త హీరోయిన్స్‌తో పోటీ ప‌డుతూ అవ‌కాశాలు చేజిక్కించుకుంటోంది. ప్ర‌స్తుతం ఎం.ఎల్.ఎ.`, అ` వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళంలో పారిస్ పారిస్` (క్వీన్ రీమేక్‌)తో బిజీగా ఉందీ ముద్దుగుమ్మ‌. ప్రస్తుతం తన డైరీ ఖాళీ లేదు. ఇలాంటి ప‌రిస్థితిలో.. కాజ‌ల్ చెంత‌కు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే ఆ ఆఫ‌ర్‌ని త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వ‌ద్ద‌నుకుంది ఈ ఉత్త‌రాది భామ‌. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కాంబినేష‌న్‌లో ఓ మల్టీ స్టారర్ మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో నానికి జోడీగా కాజల్ అయితే బాగుంటుందని చిత్ర బృందం సంప్ర‌దించింద‌ట‌. కథ నచ్చినా.. డేట్స్ అడ్జస్ట్ చేయలేక తన స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు సిఫార్సు చేసిందీ అమ్మడు. క‌థ న‌చ్చ‌డం, కాల్షీట్స్ అందుబాటులో ఉండ‌డంతో రకుల్ వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింద‌ట‌. ఈ సంఘటనతో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఎటువంటిదో తెలుస్తోంది. ఇక మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోయే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. నాగార్జున ఒక మాఫియా డాన్ పాత్రలో కనిపించనుండగా...నాని డాక్టర్ పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.