'బిచ్చగాడు' మరో రికార్డ్....

  • IndiaGlitz, [Saturday,November 26 2016]

చిన్న చిత్రంగా త‌మిళంలో విడుదలైన 'పిచ్చైకార‌న్' అక్క‌డ మంచి విజ‌యాన్ని సాధించింది. ఓ కోటీశ్వ‌రుడు త‌న త‌ల్లి కోసం 'బిచ్చ‌గాడు'గా వేష‌ధార‌ణ వేసుకుని ఏం చేశాడనే మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో విడుద‌లైన ఈ సినిమా ప్ర‌భ‌జనం క్రియేట్ చేసింది. త‌మిళం కంటే తెలుగులో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. తెలుగులో 30 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించిన ఈ సినిమాతో విజ‌య్ ఆంటోనికీ తెలుగులో పెద్ద మార్కెట్ క్రియేట్ అయ్యింది.

వెండితెర‌పైనే కాదు..ఇప్పుడు 'బిచ్చ‌గాడు' బుల్లితెర‌పై కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేసింద‌ట‌. రీసెంట్‌గా ఈ సినిమా ఓ టీవీ చానెల్‌లో ప్ర‌సార‌మైతే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న సౌంతిడియ‌న్ సినిమాల‌న్నింటికీ ధీటుగా సినిమా ఎక్కువ వ్యూవర్ షిప్‌ను సాధించింది. బార్క్ రిపోర్ట్ ప్ర‌కారం 'బిచ్చ‌గాడు' 24.5 రేటింగ్ సాధించింద‌ట‌.