'బిగ్‌బాస్ 3'... నాగ్‌పై ట్రోలింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున త్వరలోనే తెలుగులో ప్రారంభం కాబోయే రియాలిటీ షో `బిగ్‌బాస్` మూడవ సెషన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ రియాలిటీ షోలో నెటిజల్స్ ట్రోలింగ్ ఓ రేంజ్లో ఉంటాయి. ఎంతంటే.. హోస్ట్ కూడా నాకెందుకీ తలనొప్పి అనుకునేంతలా?.. నాని విషయంలో అదే జరిగింది. అయితే నాని విషయంలో బిగ్‌బాస్ షో స్టార్ట్ అయిన తర్వాత ట్రోలింగ్ స్టార్ట్ అయితే.. నాగ్ విషయంలో అందుకు భిన్నంగా జరుగుతుందట. బిగ్‌బాస్ మూడో సెషన్ స్టార్ట్ కాకముందే ఆయనపై ట్రోలింగ్ మొదలైంది.
`దేవదాస్` ప్రమోషన్స్ సమయంలో బిగ్‌బాస్ షో గురించి తన వద్ద ప్రస్తావించకండి.. బిగ్‌బాస్ కాన్సెప్ట్ నాకు నచ్చదు.. ఒకరేం చేస్తున్నారో దాగి చూడటం నాకు నచ్చదు. అని నాగ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని నెటిజన్స్ నాగ్‌ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. మరి షో ప్రారంభమైన తర్వాత నాగ్ మరెన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.