close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీకి చెదిరిన కెప్టెన్సీ కల.. కనికరించని షన్నూ, సిరికి ముక్కుపుడక

Thursday, November 25, 2021 • తెలుగు Comments

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీకి చెదిరిన కెప్టెన్సీ కల.. కనికరించని షన్నూ, సిరికి ముక్కుపుడక

బిగ్‌బాస్ 5 తెలుగులో ఈ రోజు ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది. ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో ప్రియాంక కమ్యూనిటీ టాపిక్ తీసుకురావడం హౌస్‌లో రచ్చకు కారణమైంది. ఒక్కసారైనా కెప్టెన్‌ బ్యాడ్జ్ వేసుకుని ట్రాన్స్‌జండర్ కమ్యూనిటీకి ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నట్లు పింకీ చెప్పింది. ఈ విషయంగా షన్నూ- కాజల్ గొడవ పడటంతో పింకీ ఏడ్చేసింది. ఇక కాజల్ కూతురు హౌస్‌లోకి వచ్చి తల్లికి సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీంతో తన కోసం ఎవరిని పంపిస్తున్నారంటూ బిగ్‌బాస్‌ని అడిగాడు షణ్ముఖ్. మరి ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీకి చెదిరిన కెప్టెన్సీ కల.. కనికరించని షన్నూ, సిరికి ముక్కుపుడక

నియంత మాటే శాసనం టాస్క్ ఈ రోజు కూడా కొనసాగింది. ప్రియాంక రెండోసారి కుర్చీని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ రవి, సిరి, షణ్ముఖ్‌లకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో రవి, సిరి లాస్ట్ లో రావడంతో వారిద్దరూ వెళ్లి ప్రియాంకను రిక్వెస్ట్ చేసుకున్నారు. సిరి లేకపోతే తన గేమ్ ఈజీ అవుతుందని ఆమెని ఎలిమినేట్ చేసి రవిని సేవ్ చేసింది పింకీ. దీంతో సిరి బాగా హర్టయి.. లోపలికి వెళ్లి ఏడ్చేసింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీకి చెదిరిన కెప్టెన్సీ కల.. కనికరించని షన్నూ, సిరికి ముక్కుపుడక

రవి, షణ్ముఖ్‌, ప్రియాంక చివరికి మిగిలారు. బజర్‌ మోగగానే సింహాసనాన్ని అధిష్టించాడు షణ్ను. ఆ విషయం తెలిసి సిరి లోపల నుంచి వచ్చి షణ్ముఖ్ ని గట్టిగా కౌగిలించుకొని ముద్దు ఇచ్చింది. ఇక పింకీ, రవిలలో ఒకరిని ఎలిమినేట్‌ చేసే అవకాశం దక్కించున్నాడు షన్నూ. అయితే ప్రియాంక.. ట్రాన్స్‌ కమ్యూనిటీకి తను ఆదర్శంగా ఉండాలనుకుంటున్నానని, ఒక్కసారైనా కెప్టెన్‌ అవ్వాలని ఉందంటూ తనను గేమ్‌లో నుంచి తొలగించవద్దని కోరింది. అయితే షణ్ను.. తాను రవికి ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయానని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆయనను సేవ్‌ చేస్తున్నానని చెప్పాడు షణ్ముఖ్.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీకి చెదిరిన కెప్టెన్సీ కల.. కనికరించని షన్నూ, సిరికి ముక్కుపుడక

మధ్యలో కాజల్ జోక్యం చేసుకుని తన కమ్యూనిటీ కోసం ఆలోచించాలని షణ్ముఖ్‌ని అడిగింది. ఆ ప్రతిపాదనకు షణ్ముఖ్ మండిపడ్డాడు. 'మధ్యలో కమ్యూనిటీని ఎందుకు తీసుకొస్తున్నారు..? మీరు రిక్వెస్ట్ చేసినా.. నేను పింకీని సపోర్ట్ చేయలేదని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారా..? అంటే నేను ఎదవని అవ్వాలా..? ఇది తప్పు ’’ అని చెప్పాడు. ఐదవ సీజన్‌కి చివరి కెప్టెన్సీ పోటీ కావడంతో.. షన్నూ నిర్ణయంతో పింకీకి బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్ అయ్యే అవకాశం వుండదు. ఆ విషయం గుర్తొచ్చిన పింకీ ముఖంపై కొట్టుకుంటూ వాష్ రూమ్‌ వద్దకు వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. మానస్, సన్నీ.. పింకీని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. ఆ తరువాత షణ్ముఖ్.. సిరిని హగ్ చేసుకొని ఏడ్చేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీకి చెదిరిన కెప్టెన్సీ కల.. కనికరించని షన్నూ, సిరికి ముక్కుపుడక

చివరికి కెప్టెన్సీ రేసులో రవి, షణ్ముఖ్ మిగులుతారు. ఇంటి సభ్యులు ఓటింగ్ ద్వారా షణ్ముఖ్ బిగ్‌బాస్ ఐదవ సీజన్‌లో చివరి కెప్టెన్‌గా ఎంపిక అవుతాడు. షణ్ముఖ్‌కి ఐదు ఓట్లు, రవికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుంది. ఆ తరువాత కెప్టెన్ గా గెలిచిన షణ్ముఖ్.. సిరికి ముక్కుపుడకను గిఫ్ట్ గా ఇచ్చాడు. సిరి ముక్కుపుడక పెట్టుకొనే హౌస్ లో గేమ్ ఆడింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీకి చెదిరిన కెప్టెన్సీ కల.. కనికరించని షన్నూ, సిరికి ముక్కుపుడక

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌‌లో భాగంగా 'చుక్‌ చుక్‌ చుక్‌' అంటూ బజర్‌ వచ్చిన ప్రతిసారీ ఇంటిసభ్యులంతా రైలు బోగీల్లా మారి పరుగులు తీయాల్సి ఉంటుంది. ఈ గేమ్ మధ్యలోనే ఫార్వర్డ్, పాజ్ అంటూ బిగ్‌బాస్ ఇచ్చే ఆదేశాలను హౌస్ మేట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత హౌస్‌మేట్స్ కొన్ని సరదా గేమ్‌లు ఆడతారు. ఫ్రీజ్ అయిన వారిని మిగిలిన సభ్యులు ఆటపట్టించే ప్రయత్నం చేస్తారు. అందరూ పాజ్‌లో ఉన్నప్పుడు కాజల్‌ భర్త, కూతురు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తల్లిని చూడగానే కాజల్‌ కూతురు ఎమోషనల్ అయ్యింది. భర్తపై కాజల్ ముద్దుల వర్షం కురిపించింది. నువ్వు ఇక్కడివరకు వస్తావనుకోలేదని .. టాప్‌ 5కి వచ్చినా హ్యాపీయే అని కూతురు చెప్పడంతో ఆమె నవ్వేసింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీకి చెదిరిన కెప్టెన్సీ కల.. కనికరించని షన్నూ, సిరికి ముక్కుపుడక

ఇక కాజల్ భర్త.. హౌస్‌లో ఉన్న ఒక్కొక్కరి గురించి జనాలు ఏమనుకుంటున్నారో సరదాగా చెబుతారు. అనంతరం కాజల్ భర్త, కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళతారు. రేపటి ఎపిసోడ్ లో మిగిలిన ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు హౌస్ లోకి రానున్నారు. ఎపిసోడ్ చివరిలో షన్నూ కెమెరా దగ్గరకి వెళ్లి.. తనకోసం ఎవరు వస్తారో అర్థం కావడం లేదని, ఎవరిని పంపిస్తున్నారో చెప్తే ముందుగానే ప్రిపేర్‌‌గా వుంటానని చెప్పాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz