మాట నిల‌బెట్టుకున్న సోహైల్‌

  • IndiaGlitz, [Tuesday,January 12 2021]

బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోహైల్ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నారు. బిగ్‌బాస్ 4లో ఐదుగురు ఫైన‌లిస్టుల్లో ఒక‌రిగా నిలిచిన సోహైల్‌.. త‌న‌కు డ‌బ్బులు వ‌స్తే అందులో కొంత మొత్తాన్ని సేవా కార్య‌క్ర‌మాలకు వినియోగిస్తాన‌ని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా త‌న‌కు వ‌చ్చిన రూ.25 ల‌క్షల్లో.. వివిధ సామాజిక సేవా సంస్థ‌ల‌తో పాటు, ఆర్థిక ఇబ్బందులు ప‌డుతున్న ఓ కుటుంబంతో క‌లిపి మొత్తంగా ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అందించారు. అంతే కాకుండా న‌టుడిగా తాను చేస్తున్న సినిమాల ద్వారా వ‌చ్చే మొత్తం ప‌ది నుండి ప‌దిహేను శాతం మొత్తాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కే వినియోగిస్తాన‌ని ఆయ‌న తెలిపారు.

నేరెడ్‌మెట్‌లోని మ‌దర్స్ నెస్ట్ వృద్ధాశ్రమం, రామ‌గుండంలోని త‌బిత స్వ‌చ్ఛంద సంస్థ‌, హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్ర‌న్స్ సోష‌ల్ ఆర్గ‌నైజేష‌న్‌, విజ‌య‌వాడ‌లోని జామియా మ‌హ‌దుల్ అష్రాఫ్ వంటి వంటి సేవా సంస్థ‌ల‌తో పాటు మ‌హ్మ‌ద్ మెయునుద్దీన్ కుటుంబానికి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను చెక్కుల రూపంలో అందించారు. ప్రస్తుతం సోహైల్‌కు సినిమా అవకాశాలతో పాటు టీవీ ఇండస్ట్రీ నుండి కూడా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

More News

మ‌హేశ్ కోసం ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్న‌ కొర‌టాల..!

రైట‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన కొర‌టాల శివ ఇప్పుడు స్టార్ రైట‌ర్ రేంజ్‌కు ఎదిగాడు. ఒక‌వైపు సినిమాల‌ను డైరెక్ట్ చేయ‌డ‌మే కాదు..

ద‌ర్శ‌కేంద్రుడు హీరోగా.. టైటిల్ ఏంటో తెలుసా?

సీినియర్ దర్శకుల్లో కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అంటే మ‌న‌కు ఠ‌క్కును గుర్తుకు వ‌చ్చే పేరు ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు.

అభిమానులకు గుడ్ న్యూస్.. సెట్స్‌పైకి పవన్@27

గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రారజకీయాలకు ప్రాధాన్యమిచ్చి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఆర్జీవీకి ఎఫ్‌డ‌బ్ల్యూఐసీ షాక్‌..!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మకు లాక్‌డౌన్ స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇబ్బంది క‌ల‌గ‌లేదు.

సౌత్ విల‌క్ష‌ణ న‌టుడితో  క‌త్రినా కైఫ్‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తిలో జోడీ క‌ట్ట‌నుందంటూ సినీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.