close
Choose your channels

అభిమానులకు గుడ్ న్యూస్.. సెట్స్‌పైకి పవన్@27

Tuesday, January 12, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అభిమానులకు గుడ్ న్యూస్.. సెట్స్‌పైకి పవన్@27

గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రారజకీయాలకు ప్రాధాన్యమిచ్చి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు అటు రాజకీయాలను.. ఇటు సినిమాలను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇటీవలే ‘వకీల్‌సాబ్’ షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్.. తన తదుపరి చిత్రాన్ని కూడా తాజాగా పట్టాలెక్కించేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం స్వయంగా వెల్లడించింది. పవన్ కల్యాణ్ 27వ చిత్రంగా ఇది రూపొందనుంది. నిజానికి ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే తెరకెక్కాల్సి ఉంది.

దర్శకుడు క్రిష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ సినిమాను పక్కనబెట్టేశారు. అయితే ప్రస్తుతం క్రిష్ కరోనా నుంచి కోలుకోవడంతో.. చిత్రషూటింగ్‌ మొదలైనట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌కు సంబంధించిన ఫోటోలను చిత్ర నిర్మాణ సంస్థ తన అఫీషియల్‌ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. సోమవారం పవన్ 27 చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైమంది. చిత్ర నిర్మాణ సంస్థ పోస్ట్ చేసిన పిక్స్‌లో డైరెక్టర్‌ క్రిష్‌తో పాటు ఆయన టీం మెంబర్స్ కొందరు కనిపిస్తున్నారు.

అభిమానులకు గుడ్ న్యూస్.. సెట్స్‌పైకి పవన్@27

ఈ ఫోటోను పవన్ అభిమానులు ఇప్పటికే షేర్ చేసేసి పవన్ నూతన చిత్రం ప్రారంభమైన సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ చిత్రంతో పాటు మరో చిత్రాన్ని కూడా పవన్ పట్టాలెక్కించనున్నారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. ఈ రెండు సినిమాలనూ ఏకకాలంలో పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో మరో చిత్రం రూపొందాల్సి ఉంది. నిజానికి క్రిష్‌కు కరోనా పాజిటివ్ రావడంతో సాగర్ దర్శకత్వంలోని సినిమానే పవన్ ముందుగా లైన్‌లో పెడతారని భావించారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ సినిమా ఇంకా సెట్స్ ‌పైకి రాలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.