బిగ్ బాస్ సీజన్-3: రియల్‌ కపుల్స్‌ ఒకే బెడ్‌పై ముచ్చట్లు..!

  • IndiaGlitz, [Tuesday,August 13 2019]

తెలుగు రియాల్టీ బిగ్‌బాస్ సీజన్-3 రోజురోజుకు రక్తి కట్టిస్తోంది. మొదటి మూడు వారాలు విజయంతంగా సాగగా ముగ్గురు హౌస్ నుంచి ఓటయ్యారు. అయితే నాలుగో వారం మొదట్నుంచే మళ్లీ ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో అని టెన్షన్ మొదలైంది. ఇక నాలుగోవారం మొదటి రోజు అనగా సోమవారం నాడు హౌస్‌లో ఏం జరిగింది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్ కపుల్స్ రొమాన్స్..

రియల్ కపుల్స్ వరుణ్, వితికా ఇద్దరూ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ వీరిద్దరి రొమాన్స్‌ చూడలేక బిగ్‌బాస్ ప్రియులు, వీక్షకులు కళ్లు మూసుకుంటున్నారు. అయినప్పటికీ ఎవరేం అనుకుంటే మాకెందులే అన్నట్లుగా అస్సలు తగ్గకుండా ఎప్పటిలాగే ఒకే బెడ్‌పై ముచ్చట్ల మొదలుపెట్టారు. మొదట వరుణ్ గుండెలపై వాలి.. రొమాంటిక్‌గా వరుణ్‌కి దగ్గరగా ఉండటంతో ముద్దు ముచ్చట్లు షురూ చేశారు. అయితే పక్కనే ఉన్న రాహుల్ సైడ్ అవ్వడంతో ఈ జంట మరింత రెచ్చిపోయింది.

అంతటితో ఆగని వీరిద్దరూ బుజ్జీ, బంగారం అంటూ ముచ్చట్లు చెబుతూ శ్రీముఖితో సరదాగా ఉండాలని వితికాకు వరుణ్ సలహా ఇచ్చాడు. ఇందుకు స్పందించిన వితికా అవును.. ‘నేను మామూలుగానే ఉంటున్నాను. నన్ను నామినేట్ చేయడానికి చెప్పిన కారణాలు నాకు నచ్చకపోవడంతో అందుకే నేను ఆమెతో ఫ్రీగా మూవ్ కాలేకపోతున్నాను’ అని వితికా చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన మాట వినడంతో ‘ఓకే బంగారం’ అంటూ ఆమె నుదిటిపై ఓ ముద్దు పెట్టి బుజ్జగించగా.. వితికా భర్త గుండెలపై వాలిపోయింది.. దీంతో ఈ ఇద్దరి వ్యవహారం పూర్తయ్యింది. అనంతరం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

More News

అమ్మ‌ను గుర్తు చేసుకున్న జాన్వీ

నేడు దివంగ‌త అందాల తార శ్రీదేవి 54వ జ‌యంతి. ఈ నేప‌థ్యంలో ఆమెను గుర్తు చేసుకుంటూ పెద్ద కుమార్తె జాన్వీక‌పూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

పూరి సినిమాలో విజ‌య్ ఎలా ఉండ‌బోతుందంటే?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రీసెంట్‌గా విడుద‌లైన `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో సూప‌ర్‌హిట్ సాధించాడు.

జెనీలియా దంప‌తుల విరాళం

బాలీవుడ్ హీరో, మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు రితేష్ దేశ్‌ముఖ్‌, జెనీలియా దంప‌తులు త‌మ పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు.

సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న `సాహో` ట్రైలర్

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం `సాహో`. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో

జియో బంపరాఫర్.. సెప్టెంబర్ 5నుంచి ఫైబర్‌ సేవలు

రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు.