బిగ్‌బాస్-3 విన్నర్.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్

  • IndiaGlitz, [Monday,November 04 2019]

 

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్- 3 షో.. మూడు నెలల క్రితం ప్రారంభమై నవంబర్ 3తో ముగిసింది. అయితే షో మొదలైన మొదటి ఎపిసోడ్ నుంచి వివాదాలు, సంవాదాలతో ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ బిగ్‌బాస్‌–3 షో విజేతగా తెలంగాణ సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ నిలిచాడు. దీంతో ఆయన రూ.50 లక్షల నగదు బహుమతిని దక్కించుకున్నాడు. వాస్తవానికి రాహుల్ విన్‌ అయ్యే అవకాశాలు 40% ఉంటాయని అందరూ భావించారు కానీ.. కచ్చితంగా విన్నర్ అవుతాడని మాత్రం బహుశా ఎవరూ ఊహించి ఉండరమో. ఒక్కొక్కరుగా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వస్తుండటంతో ఇక శ్రీముఖినే విన్నర్ అని అందరూ పక్కాగా ఫిక్స్ అయ్యారు. అంతేకాదు ఇలా అనుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయ్.. పవర్ స్టార్, జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌కు శ్రీముఖి వీరాభిమాని కావడంతో మొదటి రెండు సీజన్లలో లాగానే ఈసారి కూడా పవన్ అభిమానిదే గెలుపని.. దీంతో కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టినట్లేనని అందరూ భావించారు.

ఎమోషనల్ అయిన రాహుల్!

అయితే ఎవరూ ఊహించని విధంగా రాహుల్‌ విన్నర్ అవ్వడం.. శ్రీముఖి రన్నర్ అవ్వడం బిగ్‌బాస్ ప్రియులు, నెటిజన్లు, వీరాభిమానులు సైతం ఒకింత అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా రాహుల్ విన్నర్‌గా నిలిచిన అనంతరం ఈ సంద్భంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తనకు ఓట్లు వేసి గెలిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు చేశాడు. ‘ఈ విజయం నన్ను పది మెట్లు పైకి ఎక్కించాయి. ఇక నుంచి నా లైఫ్‌ కొత్తగా ఉండబోతుంది. నా గెలుపు కోసం తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రేక్షకులు ఎంతో సహకరించారు. అంతేకాదు.. నా విజయంలో పునర్నవి, వరుణ్‌, వితికల కష్టం కూడా ఉంది. అరే టాస్కులు మంచిగా ఆడరా అని పునర్నవీ బాగా ఎంకరేజ్ చేసింది. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో మా అమ్మనాన్న కడుపులో పుట్టాను’అంటూ రాహుల్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

బార్బర్ షాప్ పెడతా..!

రాహుల్ విన్నర్ కావడంతో టైటిల్‌తో పాటు రూ. 50 లక్షలు గెలుకున్నాడు. అయితే ఈ 50 లక్షల రూపాయిలు తాను ఎందుకు వినియోగిస్తానో కూడా ఇదే వేదికపై నుంచి చెప్పాడు. ప్రైజ్‌‌మనీతో ‘బార్బర్‌ షాప్‌’ పెడతానని రాహుల్‌ ప్రకటించాడు. రాహుల్ నోట ఈ మాట రావడంతో అతడికి సింప్లిసిటీ, కులవృత్తి మీదున్న గౌరవాన్ని నెటిజన్లు, బిగ్‌బాస్ ప్రియులు, ఆయన వీరాభిమానులు అందరూ మెచ్చుకుంటున్నారు.

More News

అనుష్క పాత్రలో దీపికా ప‌దుకొనె

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి స్టార్ స్టేట‌స్‌ను ఇచ్చిన చిత్రం `అరుంధ‌తి`. 2009లో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ట‌య్యింది. ప‌దేళ్ల త‌ర్వాత ఇప్పుడు

బిగ్‌బాస్-3 విన్నర్‌గా ఎవరూ ఊహించని వ్యక్తి!?

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్‌ విన్నర్ ఎవరో తెలిసిపోయింది అంటూ గత మూడ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే పక్కా సమాచారం ఎవరైనా లీక్ చేశారా..?

బిగ్‌బాస్ విన్నర్‌పై వస్తున్న పుకార్ల పట్ల నాగ్ క్లారిటీ

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్‌ లాస్ట్ డే నేడే. ఇవాళ విన్నర్ ఎవరో..? రన్నర్ ఎవరో తేలిపోనుంది. అయితే అధికారిక ప్రకటన వెలువడక మునుపే ఇదిగో విన్నర్..

ర‌వితేజ చిత్రానికి త‌మ‌న్ సంగీతం

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'మ‌హా స‌ముద్రం'ను ప‌క్క‌న పెట్టేశాడా?

డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి.. తొలి చిత్రం `RX100`తో సెన్సేష‌న‌ల్ హిట్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు. ఈ యువ ద‌ర్శ‌కుడు రెండో సినిమాను స్టార్ట్ చేయ‌డానికి మాత్రం ఎక్కువ స‌మ‌య‌మే తీసుకుంటున్నాడు.