close
Choose your channels

బిగ్‌బాస్-3 విన్నర్‌గా ఎవరూ ఊహించని వ్యక్తి!?

Sunday, November 3, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్-3 విన్నర్‌గా ఎవరూ ఊహించని వ్యక్తి!?

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్‌ విన్నర్ ఎవరో తెలిసిపోయింది అంటూ గత మూడ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే పక్కా సమాచారం ఎవరైనా లీక్ చేశారా..? లేకుంటే కొందరు పనిగట్టుకుని రూమర్స్ పుట్టిస్తున్నారా..? అనేది మాత్రం తెలియరాలేదు కానీ.. ఇందుకు సంబంధించిన వార్తలు మాత్రం అటు సోషల్ మీడియాలో.. ఇటు వెబ్‌సైట్లలో ‘ఇదిగో విన్నర్ ఎవరో తెలిసిపోయింది..’, ‘ఈ సీజన్‌కు విన్నర్ ఎవరంటే.. ’ ఇలా పుంకాలు పుంకాలుగా కథనాలు దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి గ్రాండ్ ఫినాలే అంటే చివరి రోజున విన్నర్ ఎవరనేది బిగ్‌బాస్ ప్రకటిస్తారు.. ఆ ప్రకటన ఇవాళ రాత్రికి రానుంది. కానీ.. కంటెస్టెంట్‌కు పోలైన ఓట్లు, పుకార్లను ఆధారంగా చేసుకుని వార్తలు రాసేస్తున్నారు. అంతేకాదు.. ఫొటోలు సైతం మార్ఫింగ్ చేసి మరికొందరు గట్టిగానే హడావుడి చేస్తున్నారు.

మొన్న శ్రీముఖి విన్నర్!

ఇటీవల బిగ్‌బాస్ విన్నర్ శ్రీముఖినే అని.. ఆమె బిగ్‌బాస్ వ్యాఖ్యాత అక్కినేని నాగార్జునను హగ్ చేసుకున్నట్లు ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు శ్రీముఖి చేతిలో బిగ్‌బాస్ విన్నింగ్ టైటిల్ ఉండటంతో ఇది లీకేనని అందరూ భావించారు. దీంతో విన్నర్ శ్రీముఖినే అని పుకార్లు గట్టిగా పుట్టుకొచ్చాయ్. అయితే కొద్దిసేపటికే అది మార్ఫింగ్ ఫొటో అని.. ఎవరో వీరాభిమాని ఒకరు ఫొటో షాప్‌లో మార్ఫింగ్ చేశారని తేల్చేశారు. ఈ మార్ఫింగ్ వ్యవహారానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పడింది.

నిన్న రాహుల్ విన్నర్!

ఇదిలా ఉంటే.. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అంటూ శనివారం నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హడావుడి మొదలుపెట్టారు. అయితే రాహులే విన్నర్ అనడానికి ఆయనకు పోలైన ఓట్లేనని ఆధారాలతో సహా వీరాభిమానులు బయటపెట్టారు. దీంతో అందరూ శ్రీముఖి విన్నర్ అనుకోగా.. రోజు వ్యవధిలోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యిందని రాహులే విన్నర్ అని నెటిజన్లు, అభిమానులు తేల్చేశారు. అంటే రాహుల్ విన్నర్ అయితే.. శ్రీముఖి రన్నర్‌కే పరిమితం అన్న మాట. రాహుల్ విన్నర్ అయితే మాత్రం ఇది ఎవరూ ఊహించని విషయమే అని మాత్రం పక్కాగా చెప్పుకోవచ్చు.

ఇలా అసలు ఎవరు విన్నరో..? ఎవరు రన్నరో తెలియక బిగ్‌బాస్ ప్రియులు తలలుపట్టుకుంటున్నారు. వాస్తవానికి శ్రీముఖి, రాహుల్ మధ్యనే టైట్ ఫైట్ నడుస్తోంది. అయితే వీరిద్దరిలో విన్నరెవరో.. విన్నర్ ఎవరో ఇవాళ్టితో తేలిపోనుంది. ఎప్పుడెప్పుడు లాస్ట్ డే షో ప్రారంభమవుతుందా..? అని కంటెస్టెంట్ల వీరాభిమానులు, నెటిజన్లు, బిగ్‌బాస్ ప్రియులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. సో.. విన్నర్ ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.