దేశంలో విజృంభిస్తున్న బర్డ్‌ఫ్లూ.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటంటే..

  • IndiaGlitz, [Saturday,January 09 2021]

దేశంలో బర్డ్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రతాపాన్ని చూపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కోరలు చాస్తోంది. దీంతో ఈ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈ వైరస్ నుంచి బయటపడేందుకు కార్యాచరణను రూపొందించాలని ఆదేశించింది. పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలని తెలిపింది. ఢిల్లీలో 50కి పైగా పక్షులు మరణించాయని.. వాటిలో అధికంగా కాకులున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించామని అధికారులు తెలిపారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని పోగ్‌ డ్యాం పరిసరాల్లో ఇప్పటి వరకూ 3,400 వలస పక్షులు వైరస్‌ సోకి మృతి చెందడం గమనార్హం. హరియాణాలో సైతం పంచకుల పరిసరాల్లోని కోళ్లఫాంలలో గత కొద్దిరోజులుగా 4లక్షల కోళ్లు చనిపోయాయని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి జేపీ దలాల్‌ ప్రకటించారు. మరో 1.66లక్షలకు పైగా కోళ్లకు వైరస్‌ సోకినట్లు తెలుస్తోందని.. వాటన్నింటనీ వధించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. రాజస్థాన్‌లోని 11 జిల్లాలకు బర్డ్‌ఫ్లూ వ్యాపించింది. ఇప్పటి వరకూ 223 కాకులు, 11 నెమళ్లు, 55 పావురాలతో సహా 2,166 పక్షులు మృత్యువాత పడ్డాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

తెలంగాణలో ఎక్కడా బర్డ్‌ ఫ్లూ వైర్‌స్‌కు సంబంధించిన ఆనవాళ్లు లేవని, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ షకీల్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 కోట్ల కోళ్ల సంపద ప్రస్తుతం సురక్షితంగా ఉందని చెప్పారు. తెలంగాణలో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఆనవాళ్లు లేవన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1,300 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయని వెల్లడించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల ఫాంల నుంచి నమూనాలు సేకరిస్తున్నారన్నారు. ఎక్కడా వైరస్‌ లక్షణాలు కనిపించలేదని డాక్టర్ షకీల్ వెల్లడించారు. ప్రజలు కోడి మాంసం తినటానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏ వైరస్‌ అయినా మాంసాన్ని వేడి చేయగానే, 60-70 డిగ్రీలకు ఉష్ణోగ్రతకు చేరగానే చనిపోతుందని... ఇక ఫ్రై చేసే సమయంలో నూనెల వేడికి 150 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవు. చికెన్‌ నిర్భయంగా తినొచ్చని షకీల్ వెల్లడించారు.

More News

మస్క్ ట్వీట్ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..

ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ఒక్క ట్వీట్‌తో రేపిన దుమారం అంతా ఇంతా కాదు.

థియేట‌ర్స్ ఆక్యుపెన్సీ.. కేంద్రానికి లేఖ రాసిన ఎఫ్ఎఫ్ఐ

పండ‌గ‌లు వ‌చ్చేస్తున్నాయి. కానీ కోవిడ్ ప్ర‌భావం నుండి థియేట‌ర్స్‌కు ఇంకా విముక్తి దొర‌క‌డం లేదు.

మ‌రో ఇతిహాసంపై త్రివిక్ర‌మ్ క‌న్ను...!

మాట‌ల ర‌చ‌యిత‌గా త‌న మార్కు చూపించుకుని డైరెక్ట‌ర్‌గా టాప్ రేంజ్‌కి ఎదిగిన వ్య‌క్తి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌.

గోపీచంద్ స‌ర‌స‌న ‘ఫిదా’ బ్యూటీ

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్స్‌పై ఓ సినిమాను చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

‘క్రాక్’ మ‌ల్టీప్లెక్స్ షో వాయిదా.. కారణమదే..!

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం క్రాక్.