తిరుగులేని శక్తిగా మారిన బీజేపీ!!

  • IndiaGlitz, [Wednesday,August 21 2019]

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరుగులేని శక్తిగా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మరింత బలపడిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందుకు కారణం పార్టీ సభ్యత్వమే. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్ట మొదట సభ్యత్వాలపైనే కమలనాథులు దృష్టి పెట్టారు. తాజాగా.. 4 కోట్ల మందికిపైగా దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వం తీసుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బీజేపీ సభ్యత్వాలు 14.78 కోట్లకు చేరుకున్నట్లు బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. జూలై 6న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్నటితో (ఆగస్ట్ 20) ముగిసిందని తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌లో 55 లక్షలు, ఢిల్లీలో 15 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారని చెప్పింది. తొలుత 2 కోట్ల కొత్త సభ్యత్వాలను టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ... ఆ తర్వాత టార్గెట్ ను 4 కోట్లకు పెంచింది.మొత్తానికి చూస్తే.. ఊహించని విధంగా బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న మద్దతు ఇతర పార్టీలకు వణుకు పుట్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు.

More News

‘విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాగే చిదంబరం కూడా..!’

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదన్న విషయం విదితమే.

'ఉండి పోరాదే' సెన్సార్ పూర్తి, ఆగష్టు 31న రిలీజ్

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో

వైఎస్ జగన్ ‘బాహుబలి’.. గౌతమ్ ‘సైరా నర్సింహారెడ్డి’!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ‘బాహుబలి’, మంత్రి గౌతమ్ రెడ్డి..

బిగ్‌బాస్-3 ఫేమ్ ‘రోహిణి’ని కమిట్మెంట్ అడిగారట

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్- 3 ఫేమ్ రోహిణి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం విదితమే.

కేసీఆర్-కట్టప్ప మధ్య మళ్లీ గ్యాప్ వచ్చిందేం!?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్- ఆయన కుటుంబానికి, పార్టీకి కట్టప్పలా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుకు మధ్య మళ్లీ గ్యాప్ వచ్చిందా..?