close
Choose your channels

అందర్నీ కొట్టేశారు.. మిగిలింది కేసీఆర్ ఒక్కరే..!

Saturday, December 5, 2020 • తెలుగు Comments
KCR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అందర్నీ కొట్టేశారు.. మిగిలింది కేసీఆర్ ఒక్కరే..!

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కేవలం 2000 ఓట్లు సాధించిన బీజేపీ.. అనతి కాలంలోనే అనూహ్యంగా పుంజుకుంది. టీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో నూటికి నూరు శాతం బీజేపీ సక్సెస్ అయింది. వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని టీఆర్ఎస్‌కి షాక్ ఇచ్చింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 4 సీట్లను మాత్రమే కైవసం చేసుకున్న బీజేపీ తాజాగా 49 సీట్లను కైవసం చేసుకుని టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది.

కేసీఆర్ కూతురు మొదలు..

పార్లమెంట్ ఎన్నికలతో మొదలు పెట్టిన హవా జీహెచ్ఎంసీ ఎన్నికల వరకూ కొనసాగిస్తూనే ఉంది. అయితే ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్కరినీ దెబ్బ కొడుతూ వచ్చింది. ఇక మిగిలింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమే. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్‌లో కేసీఆర్ కూతురు కవితను పెద్ద దెబ్బ కొట్టింది. దుబ్బాక ఎన్నికను తన భుజస్కందాలపై వేసుకున్న సీఎం కేసీఆర్ అల్లుడు, మంత్రి అయిన హరీష్‌రావును కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను నెత్తిన వేసుకున్న కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్‌ను చావు దెబ్బ కొట్టింది. ఇక మిగిలింది కేసీఆర్ మాత్రమే.

నెక్ట్స్ ఆపరేషన్ అసెంబ్లీ..

కేసీఆర్‌ను కొట్టేందుకు అసెంబ్లీ ఎన్నికలే మార్గం. ఇదే స్ఫూర్తితో ఆపరేషన్ అసెంబ్లీ కూడా బీజేపీ మొదలు పెట్టడం ఖాయం. ఈ లెక్కన టార్గెట్ పెట్టుకుని అతి తక్కువ కాలంలోనే ఇన్ని సాధించిన బీజేపీకి.. నెక్స్ట్ ఎన్నికల్లో సీఎం పీఠాన్ని కొట్టడం పెద్ద విషయమేమీ కాదని విశ్లేషకులుచెబుతున్నారు. మధ్యంతర ఎన్నికలు రావొచ్చని ఎప్పట్నుంచో ఢిల్లీ మొదలుకుని గల్లీ లీడర్ల వరకు చెబుతున్నారు. అదే జరిగితే ఇక కేసీఆర్‌ను కొట్టడం ఖాయమని అన్నట్లుగా బల్దియా ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇదే జరిగితే టీఆర్ఎస్ ఖేల్ ఖతమే..

మళ్లీ కేసీఆర్ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందేమో..

వాస్తవానికి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎంతసేపూ.. బక్క కేసీఆర్‌ను కొట్టడానికి అంత మంది వచ్చారు... ఇంత మంది వచ్చారు అని చెప్పారు.. ఆయన అనుకున్నట్లుగానే బక్కోడిని గట్టిగా కొట్టిపోయారు.. దీంతో సగానికి కేసీఆర్‌కు దెబ్బ పడింది.. ఇక మధ్యంతర ఎన్నికలు వస్తే అంతే సంగతులేమో.. అన్నట్లు పరిస్థితులు మారిపోతున్నాయి. అయితే ఈ ఎన్నికలకైతే టీఆర్ఎస్ ఆవేశపడి అడుగులు అయితే వేయదని తెలుస్తోంది. ఇక ప్రతి అడుగూ ఆచి తూచి వేస్తుంది. ఎందుకంటే ఇక మీదట పరిస్థితులన్నీ టీఆర్ఎస్‌కు చావో రేవో తేల్చుకునేవి గానే కనిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.