కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత

  • IndiaGlitz, [Friday,April 05 2024]

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలే హస్తం పార్టీ కండువా కప్పుకోగా.. తాజాగా బీజేపీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత కూన శ్రీశైలం‌గౌడ్ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు కూడా పాల్గొన్నారు.

కాగా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన ఆయన రెండో స్థానంలో నిలిచారు. మాస్ లీడర్‌గా శ్రీశైలం గౌడ్‌కు మంచి పేరుంది. ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ను ఆశించారు. కానీ ఆ సీటును బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్‌కు ఇచ్చింది. అప్పటి నుంచి పార్టీపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డి.. ఆయనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.

1992 నుంచి యూత్ కాంగ్రెస్‌లో ఉన్న ఆయన 2009లో ఇండిపెడెంట్‌గా పోటీ చేసి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2021లో బీజేపీలో చేరారు. అయితే బీజేపీ మీద అసంతృప్తితో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోనే కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. దీంతో శ్రీశైలం గౌడ్ చేరికతో కాంగ్రెస్ గెలుపు తేలిక అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంటు సీటుపై ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు సాగుతోంది.

కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డికి బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఈ సీటును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో మరోసారి గెలవాలని పట్టుదలతో ఉన్నారు. 2009 నుంచి ఇప్పటివరకు మల్కాజ్‌గిరి పార్లమెంటు నుంచి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలవగా.. ఒకసారి టీడీపీ విజయం సాధించింది. ఈ పార్లమెంట్ పరిధిలోకి మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

More News

Sharmila: హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలి: షర్మిల

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలని ప్రజలకు పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు.

Chandrababu: చంద్రబాబుకు భారీ షాక్.. ఎన్నికల సంఘం నోటీసులు..

ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు మరో 40 రోజులు మాత్రమే ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నాయి.

YSRCP: ఏపీలో వైసీపీ సునామీ ఖాయం.. ప్రముఖ జాతీయ సర్వేలో స్పష్టం..

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

ఇదేం విడ్డూరం అయ్యా.. సీటు బెల్ట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు జరిమానా..

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ప్రమాదాలు నివారించండి అని పోలీసులు తరుచూ చెబుతూ ఉంటారు. ఇదే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝూళిపిస్తుంటారు.

Congress Manifesto: 'పాంచ్‌న్యాయ్' పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రజలపై వరాల జల్లు..

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రకటించింది. దేశ ప్రజలకు వరాల జల్లు కురింపించింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు