ఢిల్లీ : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు

  • IndiaGlitz, [Friday,January 29 2021]

దేశ రాజధాని ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు జరిగింది. ఎంబసీ భవనం పేవ్‌మెంట్ వద్ద ఈ పేలుడు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా జరిగిన బీటింగ్ రిట్రీట్‌కు కేవలం కిలో మీటరు దూరంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. పేలుడు ధాటికి మూడు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5:45 గంటలకు ఈ పేలుడు జరిగినట్టు తమకు సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ స్పెషల్ పోలీసులు, స్పెషల్ స్క్వాడ్ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం స్పందించింది. తామంతా సురక్షితంగానే ఉన్నామని, అప్రమత్తంగానే ఉన్నామని అధికారులు వెల్లడించారు.పేలుడు నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నామని రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

More News

‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2’ రిలీజ్ ఫిక్స్

తొంద‌ర‌ప‌డితే చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌లేం..ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం.. ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు రాకీభాయ్‌..

ట్రెమెండస్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తోన్న మెగాస్టార్ 'ఆచార్య' టీజర్

'ఆచార్య దేవో భవ' అని మన అందరికీ తెలిసిందే.. కానీ 'ఆచార్య రక్షోభవ' అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరం: కోవింద్

పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి నేడు రాష్ట్రపతి కోవింద్‌ ప్రసంగించారు.

రోడ్డు ప్రమాదంలో పెళ్లికూతురు సహా ఆరుగురి దుర్మరణం

కూతురి పెళ్లిని ఎంతో ఆనందంగా.. ఘనంగా జరిపించాలనుకున్నారు. వచ్చే నెల 10వ తారీఖున క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరిపించేందుకు ఇరువైపుల పెద్దలూ ముహూర్తం నిశ్చియించారు.

'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రంలో 'మ‌న‌సు క‌థ' పాట‌ను విడుద‌ల చేసిన అద‌న‌పు డీసీపీ మ‌ద్దిపాటి శ్రీ‌నివాస్ రావు

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర పోషించిన 'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రంలోని మూడో పాట "మ‌న‌సు క‌థ‌"ను