కొత్త సంవత్సరంలో విడుదల కాబోతున్న 'బోగ‌న్'

  • IndiaGlitz, [Friday,December 18 2020]

స్టైలిష్ యాక్ట‌ర్ అర‌వింద్ స్వామి, స‌క్సెస్ ఫుల్ హీరో జ‌యం ర‌వి, బ‌బ్లీ బ్యూటీ హన్సిక కాంబినేష‌న్ లో తెర‌కెక్కి త‌మిళంలో సూప‌ర్ హిట్ టాక్ అందుకున్న బోగ‌న్ చిత్రాన్ని అదే పేరుతో ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్ష‌కులకి ముందుకు తీసుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే బోగ‌న్ తెలుగు వెర్ష‌న్ కి సంబంధించిన ట్రైల‌ర్ తో పాటు సోనీ మ్యూజిక్ ద్వారా విడుద‌లైన అన్ని వీడియో సాంగ్స్ అటు సోష‌ల్ మీడియాతో పాటు ఇటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో బోగ‌న్ (తెలుగు) ను న్యూ ఇయ‌ర్ కానుక‌గా జ‌న‌వ‌రి 1, 2021న విడుద‌ల చేస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ ప‌తాకం పై బోగ‌న్ (తెలుగు) భారీ స్థాయిలో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావటానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు.

'త‌ని ఒరువ‌న్' త‌ర్వాత 'జ‌యం' ర‌వి, అర‌వింద్ స్వామి కాంబినేష‌న్‌లో రూపొంది సూప‌ర్‌హిట్ట‌యిన మ‌రో సినిమానే ఈ 'బోగ‌న్‌'. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీని డైరెక్ట‌ర్‌ ల‌క్ష్మ‌ణ్ రూపొందించారు. హీరోయిన్‌గా హ‌న్సికా మొత్వాని న‌టించిన ఈ చిత్రంలో నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, అక్ష‌ర గౌడ ఇత‌ర పాత్ర‌ధారులు. డి. ఇమ్మాన్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.

తారాగ‌ణం: జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి, హ‌న్సికా మొత్వానీ, నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, నాగేంద్ర‌ప్ర‌సాద్‌, వ‌రుణ్‌, అక్ష‌ర గౌడ‌

More News

తన పెళ్లంటూ వస్తున్న వార్తలపై అల్లు శిరీష్ క్లారిటీ...

త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి జరగనుందంటూ ప్రచారం జోరుగా సాగింది. దీనికి కారణం లేకపోలేదు..

భార్య కోసం కొబ్బరి చెట్టెక్కాడు..

కొన్ని పరిస్థితులు ఆ సమయానికి కంగారు పుట్టించినప్పటికీ తరువాత మాత్రం ఫన్నీగా మారిపోతుంటాయి.

గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా మెగాస్టార్ ఫిక్స్!

అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4 మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది.

బీజేపీ కార్పొరేటర్లను కెలికితే.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

తమ పార్టీ కార్పొరేటర్లను కెలికితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడానికి వెనుకాడబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.

వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన సుప్రీమ్‌ హీరో

మాట ఇవ్వడం అందరూ చేస్తారు. కానీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేవారు కొందరే. ఆ కొందరిలో నేను సైతం అని అంటున్నారు సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌.