కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు...

  • IndiaGlitz, [Monday,September 25 2017]

ఇండియాలో క్రికెట్‌కు క్రేజ్ తీసుకొచ్చిన ఆట‌గాళ్ల‌లో ముఖ్యుడు క‌పిల్‌దేవ్‌. 1983 క‌పిల్ డెవిల్స్ పేరుతో ఏకంగా వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సొంతం చేసుకోవ‌డం విశేషం. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల హ‌వా జోరుగా కొన‌సాగుతున్న స‌మ‌యంలో క‌పిల్‌దేవ్ బయోపిక్‌కు శ్రీకారం చుట్టిన సంగ‌తి విదిత‌మే.
సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌, సైమా అవార్డ్స్ ఫౌండ‌ర్ విష్ణు ఇందూరి 1983 వర‌ల్డ్‌క‌ప్ విన్నింగ్ టీంపైనే సినిమాను రూపొందించ‌బోతున్నాడ‌ట‌. అందులో క‌పిల్‌దేవ్‌గా బాలీవుడ్ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్ న‌టించ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. భ‌జ‌రంగీభాయ్ జాన్ ద‌ర్శ‌కుడు క‌బీర్‌ఖాన్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు తెలుస్తాయి.

More News

అక్టోబ‌ర్ 18న డిటెక్టివ్‌?

విశాల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన త‌మిళ చిత్రం తుప్ప‌రివాల‌న్‌. ఈ నెల 14న విడుద‌లైన ఈ చిత్రం త‌మిళ‌నాట మంచి వ‌సూళ్లను సొంతం చేసుకుంది. అను ఇమ్మానియేల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

వెంకటేష్ శ్రీనివాస కళ్యాణంకి 30 ఏళ్లు

యువ చిత్ర సంస్థ నుంచి ఓ సినిమా వస్తోందంటే..

అక్టోబ‌ర్ 1న 'సాయి నీ లీల‌లు' పాట‌లు రికార్డింగ్ ప్రారంభం

క‌రుణామ‌యుడిగా, వేమ‌న‌గా, ఆంద్ర‌కేస‌రిగా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయిన న‌ట పిపాసి విజ‌య్ చంద‌ర్. తాజాగా ఆయ‌న అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు, స‌చ్చిదానంద స‌మ‌ర్ధ స‌ద్గురువుగా భ‌క్తుల‌చే కీర్తించ‌బ‌డే శ్రీ షిరిడి సాయినాధుని క‌థ‌ను 'సాయి నీ లీల‌లు' టైటిల్ తో తెర‌కెక్కుతోన్న చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసింద

త్రివిక్రమ్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర అదేనా?

జైలవకుశ లో మూడు విభిన్న పాత్రలు చేసి మెప్పించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

హ్యాట్రిక్ కొట్టనున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం జైలవకుశ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా..