close
Choose your channels

కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు...

Monday, September 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇండియాలో క్రికెట్‌కు క్రేజ్ తీసుకొచ్చిన ఆట‌గాళ్ల‌లో ముఖ్యుడు క‌పిల్‌దేవ్‌. 1983 క‌పిల్ డెవిల్స్ పేరుతో ఏకంగా వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సొంతం చేసుకోవ‌డం విశేషం. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల హ‌వా జోరుగా కొన‌సాగుతున్న స‌మ‌యంలో క‌పిల్‌దేవ్ బయోపిక్‌కు శ్రీకారం చుట్టిన సంగ‌తి విదిత‌మే.
సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌, సైమా అవార్డ్స్ ఫౌండ‌ర్ విష్ణు ఇందూరి 1983 వర‌ల్డ్‌క‌ప్ విన్నింగ్ టీంపైనే సినిమాను రూపొందించ‌బోతున్నాడ‌ట‌. అందులో క‌పిల్‌దేవ్‌గా బాలీవుడ్ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్ న‌టించ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. భ‌జ‌రంగీభాయ్ జాన్ ద‌ర్శ‌కుడు క‌బీర్‌ఖాన్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు తెలుస్తాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.