close
Choose your channels

అల్లు అర్జున్ సినిమాపై బాలీవుడ్ హీరో కామెంట్‌

Thursday, May 28, 2020 • తెలుగు Comments

అల్లు అర్జున్ సినిమాపై బాలీవుడ్ హీరో కామెంట్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి 2020 బాగా క‌లిసొచ్చింది. ఈయ‌న హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ చిత్రం నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ప‌లు హీరోల పేర్లు విన‌ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ ఓపెన్ అయ్యాడు. ఓ ఇంట‌రాక్ష‌న్‌లో ఆయన మాట్లాడుతూ తాను నెట్‌ఫ్లిక్స్‌లో అల వైకుంఠ‌పుర‌ములో సినిమా చూశానని, ఎట్టి పరిస్థితుల్లో తానే చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్లు చెప్పాడు. త‌న‌ను త‌ప్ప మ‌రో హీరోను ఆ పాత్ర‌లో ఊహించుకోలేపోతున్నాన‌ని కూడా కార్తీక్ ఆర్య‌న్ చెప్ప‌డం విశేషం.

అల్లు అర్జున్ సినిమాపై బాలీవుడ్ హీరో కామెంట్‌

ఇదే ఏడాదిలో బ‌న్నీ త‌న పాన్ ఇండియా చిత్రం పుష్ప‌ను కూడా స్టార్ట్ చేయ‌బోతున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రం జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. ఈ చిత్రంతో తొలిసారి బాలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకు బ‌న్నీ రాబోతున్నారు. తెలుగు సినిమాకు పాన్ ఇండియా స్థాయి క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో బ‌న్నీ తొలి చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకుంటాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ర‌ష్మిక మంద‌న్నా ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Get Breaking News Alerts From IndiaGlitz