అల్లు అర్జున్‌ని ఆరాదిస్తోన్న బాలీవుడ్ తారలు

  • IndiaGlitz, [Wednesday,July 15 2020]

ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి ‘అల వైకుంఠపురములో..’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్. రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించి నాన్ బాహుబలి రికార్డులను ఈ చిత్రం క్రియేట్ చేసింది. నిర్మాతలకే కాదు..ఈ సినిమాతో భాగమైన ప్రతి ఒక్కరికీ ఇది లాభాలను తెచ్చి పెట్టింది. సక్సెస్ విషయాన్ని పక్కన పెడితే, ఈ సినిమాతో బన్నీ క్రేజ్ ఇండియా అంతటా పాకింది. అందుకు ఉదాహరణ ఈ సినిమాలో బన్నీ వేసిన స్టెప్స్‌ను బాలీవుడ్ స్టార్స్ కూడా ట్ర్రై చేయడమే. బన్నీ ప్రెజెన్స్ బాలీవుడ్ తారలను కూడా ఆకట్టుకుంది.

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ‘బుట్టబొమ్మ..’ సాంగ్ చూసి బన్నీ డాన్సులతో ఎంతో ఇన్‌స్పైర్ అయ్యానని థాంక్స్ చెబుతూ.. బన్నీ డాన్సింగ్ స్టెప్‌ను పోస్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ స్పందిస్తూ.. ‘ఓ మై గాడ్..ఎనర్జిటిక్, స్ట్రాంగ్, ఇన్‌స్పైరింగ్’అన్నారు. ‘బుట్టబొమ్మ..’ సాంగ్ పాడిన అర్మాన్ మాలిక్ బన్నీ తన ఫేవరేట్ హీరో అని తెలిపారు.

బాలీవుడ్ స్టార్స్ శిల్పా శెట్టి, షమితా శెట్టి సైతం బుట్టబొమ్మ సాంగ్‌కు కాలు కదిపారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా భార్యతో కలిసి ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులేయడం విశేషం. సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు అందరూ ఈ సినిమాలో పాటలకు టిక్ టాక్ వీడియోలను పోస్ట్ చేశారు. ఇలా బాలీవుడ్ స్టార్స్‌కు అల్లు అర్జున్ ఫేవరెట్ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో రా అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నారు బన్నీ. ఈ సినిమాలో బన్నీ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసినప్పుడు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ఎలాంటి అంచనాలు మరింత పెరిగాయి.

More News

జగన్ కీలక నిర్ణయం.. కరోనా మృతుడి అంత్యక్రియలకు రూ.15000

ఏపీ సీఎం జగన్ కరోనా బాధితుల విషయమై మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో

హిందీలో రీమేక్ అవుతున్నతెలుగు సెన్సేష‌న‌ల్ యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్‌’

ఈ ఏడాది ప్రారంభంలో విడుద‌లై, ప్రేక్ష‌కాద‌ర‌ణతో బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌హిట్‌గా నిలిచిన చిత్రం ‘హిట్‌’.

క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం.. ఆరుగురి రక్త నమూనాలను సేకరించిన నిమ్స్

కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు దేశాలన్నీ వడివడిగా అడుగులు వేస్తున్నాయి.

కేసీఆర్ వచ్చి ఫీల్డ్‌లో నిలబడటానికి ఇదేమైనా క్రికెట్ మ్యాచా?: ఒవైసీ

సీఎం కేసీఆర్ కనిపించడం లేదనే వార్తలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

ఏపీలో సడెన్‌గా పెరిగిన కరోనా కేసులు.. కారణం ఇదేనా?

కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. టెస్టుల మొదలు.. ట్రేసింగ్.. ట్రీట్‌‌మెంట్ అంతా పర్‌ఫెక్ట్‌గా జరుగుతోంది.