'బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్' చిత్రం టీజ‌ర్ విడుద‌ల

  • IndiaGlitz, [Friday,October 02 2020]

యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ శ్రీకృష్ణ‌(నందు), డ‌స్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ కలయికలో తెరకెక్కిన‌ చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్‌. టైటిల్ తోనే అటు ఆడియెన్స్ లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న తెచ్చుకుంది ఈ సినిమా. ఇక ఆ త‌రువాత విడుద‌లైన నందు ఫ‌స్ట్ లుక్ తో పాటు, ర‌ష్మీ గౌత‌మ్ లుక్స్ కి సైతం ఫుల్ క్రేజ్ రావ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం బృందం తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ని విడుద‌ల చేశారు.

ఈ సినిమాలో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ ఫ్యాన్ గా న‌టిస్తున్నాడు, నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉండ‌బోతుంద‌ని, నందు పాత్ర‌కు ధీటుగా ర‌ష్మీ గౌత‌మ్ పాత్ర కూడా ఉండ‌బోతుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మాణం అవుతున్న ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శ‌కునిగా చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ తో అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని విడదులకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాత‌లు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌ల‌వ్వ‌నుంది.

న‌టీన‌టులు: నందు ఆనంద్ కృష్ణ‌, ర‌ష్మీ గౌత‌మ్

More News

పంజాగుట్ట పీఎస్‌లో క్యాబ్ డ్రైవర్‌పై ముమైత్ ఫిర్యాదు..

సినీ నటి ముమైత్ ఖాన్ తనకు డబ్బులు ఎగ్గొట్టారంటూ ఇటీవల క్యాబ్ డ్రైవర్ రాజు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

అనుకున్నదొక్కటి.. అయినది ఒకటి.. మెహబూబ్ ప్లాన్ రివర్స్..

తానేదో తలిస్తే దైవమేదో తలిచినట్టు అయింది మెహబూబ్ పని. కెప్టెన్ అవ్వాలనుకుని నైట్ అంతా నిద్ర లేకుండా కాయిన్స్‌ని పోగేసుకున్నాడు.

డబ్బులు ఎవరికీ ఊరికే రావంటూ.. ఏకంగా పాటే పాడేశారు...

డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అనగానే మనకు ఓ వ్యక్తి గుర్తొస్తారు కదా.. నున్నటి గుండుతో ఆయన తన మాటలతోనే తెగ పాపులర్ అయిపోయారు.

టీడీపీ పొలిట్ బ్యూరోకి గల్లా అరుణ రాజీనామా.. ఏపీ రాజకీయాల్లో కలకలం

టీడీపీ పొలిట్ బ్యూరోకి గల్లా అరుణ రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది.

నితిన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో 'చెక్'

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకం పైవి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'చెక్' అనే టైటిల్  ఖరారు చేశారు.