కన్ ఫర్మ్ చేసిన బోయపాటి

  • IndiaGlitz, [Tuesday,January 09 2018]

నట‌సింహ‌ బాలకృష్ణ, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో సినిమా అంటే అది మాస్ ప్రేక్షకులకి పండగనే చెప్పాలి. ఇక యాక్షన్ ప్రియులకి కనువిందే. కాగా, నిన్న (సోమవారం) జై సింహా' ప్రీ-రిలీజ్ ట్రైలర్ ఫంక్షన్‌లో.. తమ కాంబినేషన్‌లో మరొక సినిమా ఉండబోతోందని బోయపాటి ప్రకటించడంతో.. నందమూరి అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా ఉంది.

వీరి కలయికలో ఇప్ప‌టికే సింహా', లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ రావడంతో.. రానున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై ఇప్ప‌టినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే... గ‌తంలో బోయపాటి ఓ పొలిటికల్ సబ్జెక్ట్‌ని బాలయ్య కోసం అనుకున్నట్టు కథనాలు వినిపించాయి. అంతేకాకుండా.. ఆ కథని సినిమాగా తీసి.. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల సమయానికి ముందే ఈ సినిమాను విడుదల చేస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి. మరి ఆ కథనే తెరకెక్కిస్తారో లేదంటే మరో కథతో సినిమా చేస్తారో చూడాలి. ప్రస్తుతం బోయపాటి.. రామ్ చరణ్‌తో సినిమాను చేయనున్నారు. ఈ నెల‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అలాగే బాలయ్య కూడా తేజ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్'లో టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలు పూర్త‌య్యాకే వీరి కాంబినేష‌న్ మూవీ స్టార్ట్ కావొచ్చ‌ని తెలిసింది.

More News

అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌ పై 'రంగుల‌రాట్నం' చేయ‌డం చాలా సంతోషంగా ఉంది - శ్రీరంజ‌ని, చిత్రా శుక్లా

అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ నిర్మాణంలో రూపొందిన చిత్రం 'రంగులరాట్నం'. రాజ్‌తరుణ్‌, చిత్రా శుక్లా హీరో హీరోయిన్స్‌. శ్రీరంజని దర్శకురాలు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది.

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'ఇగో'

'ఆకతాయి' ఫేమ్‌ ఆశిష్‌ రాజ్, సిమ్రాన్‌ జంటగా రూపొందుతోన్న సినిమా "ఇగో". సుబ్రమణ్యం దర్శకత్వంలో విజయ్‌ కరణ్‌–కౌసల్‌ కరణ్‌–అనిల్‌ కరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం సమకూర్చారు.

శివాని సినిమా కన్ ఫర్మ్..

జీవితా రాజశేఖర్ తనయ శివాని తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది.

హెబ్బాపటేల్ కొత్త మూవీ డిటైల్స్

'అలా ఎలా','కుమారి 21 ఎఫ్',`ఈడోరకం ఆడోరకం' సినిమాలతో వరుస విజయాలను అందుకున్న ముద్దు గుమ్మ హెబ్బా పటేల్

ఫిబ్రవరికి వాయిదాపడిన 'రాజుగాడు'?

రాజ్ తరుణ్ హీరోగా సంజనా రెడ్డి రూపొందించిన చిత్రం‘రాజుగాడు’.ఇందులో అమైరా దస్తర్ కథానాయికగా నటించింది.