close
Choose your channels

బర్త్ డే రోజున బాలకృష్ణ సినిమా గురించి చెప్పిన బోయపాటి

Thursday, April 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బర్త్ డే రోజున బాలకృష్ణ సినిమా గురించి చెప్పిన బోయపాటి

బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో సినిమా అంటేనే ఫుల్‌ క్రేజ్‌ ఉంటుంది. 'సింహా', 'లెజెండ్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్‌ ఇప్పుడు హ్యాట్రిక్‌ ఇవ్వడానికి రెడీ అవుతోంది. గురువారం బోయపాటి శ్రీను పుట్టినరోజు.

ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో బాలకృష్ణతో చేయనున్న సినిమా గురించి ఆయన చెప్పారు. ఆగస్ట్‌ రెండో వారంలో షూటింగ్‌ ఆరంభించి, వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనుకుంటున్నామని బోయపాటి శ్రీను తెలిపారు.

ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులతో పాటు ఎంతోమంది టెక్నీషియన్లు ఆయనకు అభినందనలు తెలియచేశారు. ఆయన జన్మదిన వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని, శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.