ల‌య‌న్ కింగ్ కి డ‌బ్బింగ్ చెప్పిన స్టార్ క‌మీడియ‌న్స్ బ్ర‌హ్మానందం, ఆలీ

  • IndiaGlitz, [Wednesday,June 19 2019]

క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యం లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారు చేసిన లయన్ కింగ్ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబ నే లయన్ కింగ్ కథ కి హీరో, అలానే సింబ తో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథ లో ముఖ్య పత్రాలు. కార్టూన్ నెట్వర్క్ లో కామిక్ సీరియల్ గా మొదలైన లయన్ కింగ్ ని ఆ తరువాత డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమా గా 90లో విడుదల చేసారు.

అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ తో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్ కింగ్ ఫాన్స్ కి, కామిక్ అభిమానులకి సరి కొత్త అనుభూతుని ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందలో భాగం గానే లయన్ కింగ్ కొత్త హంగులతో 3డి ఆనిమేటెడ్ సినిమా గా జులై 19న విడుదల అవుతుంది. ఇప్పుడు ఈ విజువ‌ల్ వండ‌ర్ కి షారుఖ్ ఖాన్ గాత్ర ధానం చేశాడు. ల‌య‌న్ కింగ్ లో కీల‌క పాత్రైన ముసాఫాకు షారుక్ డ‌బ్బింగ్ చెప్పారు, ఇక ముసాఫా త‌న‌యుడు సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. 

అలానే ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ లో పుంబా పాత్ర‌కు హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం డ‌బ్బింగ్ చెప్పారు, అలానే టీమోన్ పాత్ర‌కు ఆలీ గాత్ర‌ధానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, మార్వేల్ - డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే అల్లాద్దీన్ రూపం లో మరో మారు డిస్నీ వారు వరల్డ్ మూవీ లవర్స్ ని అలరించారు. ఇప్పుడు లయన్ కింగ్ రూపం లో మరో హిట్ తమ అకౌంట్ లో పడనుంది అని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదల కి రెడీ అవుతుంది.

More News

రాజ్‌ తరుణ్‌ హీరోగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా హిట్‌ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై యువ దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు నిలిపివేత‌..?

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు జ‌ర‌గ‌వా?  ఎన్నిక‌ల‌ను నిలిపేస్తారా? ఇప్పుడు సౌత్ ఇండియాలో ఆర్టిస్టుల మ‌ధ్య ఇదే టాపిక్‌.

అమ‌ల‌ను పొగుడుతున్న స‌మంత‌

హెడ్డింగ్ చూసి త‌న అత్త‌గారు అమ‌ల‌ను స‌మంత పొగుడుతుందా?  అని అనుకుంటున్నామో. అలా అనుకుంటే త‌ప్పులో బుర్రేసిన‌ట్టే .

బాల‌య్య ప‌క్క‌న శ్రియ‌?

బాల‌య్య స‌ర‌స‌న శ్రియ అన‌గానే అంద‌రికీ వారు గ‌తంలో చేసిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా గుర్తుకొస్తాయి.

'సాయిధ‌ర‌మ్ తేజ్‌' తాజా ప్ర‌స్థానం..

`ప్ర‌స్థానం` అనే సినిమాకు తెలుగు సినిమా హిస్ట‌రీలో త‌ప్ప‌కుండా ఓ గుర్తింపు ఉంటుంది. ఆ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ద‌ర్శ‌కుడు దేవాక‌ట్టా.