కత్తి రెడ్డిగా బ్రహ్మానందం?

  • IndiaGlitz, [Monday,July 03 2017]

”కత్తి రెడ్డి ” టైటిల్ వినగానే షాక్ అవుతున్నారా ? ఈ కత్తి రెడ్డి .. ఎవరు ? ఏమా కథ అంటే .. టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం లీడ్ రోల్ లో నటించే సినిమా ! ”కత్తి రెడ్డి” .. ఎత్తితే .. దించడు' అనేది ట్యాగ్ లైన్ ? బ్రహ్మానందం లీడ్ రోల్ పోషించే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఖాన్ దాదా లాంటి తరహా లో ఈ పాత్ర సాగుతుందట.
పూర్తీ స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో కీ రోల్ లో రచ్చ రవి నటిస్తున్నాడు. వి రవివర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ మధ్య బ్రహ్మానందం క్రేజ్ బాగా తగ్గింది. ఒకప్పుడు బ్రహ్మానందం ఉంటేనే సినిమా చేస్తానని చెప్పిన హీరోలు ఉన్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం లేకుండానే చాలా సినిమాలు వస్తున్నాయి. సినిమాలో మళ్ళీ తన హవా చాటుకోవడానికి బ్రహ్మానందం ప్రయత్నాలు మొదలు పెట్టాడు, ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఓకే చెప్పాడు. సో ఈ కత్తి రెడ్డి చేసే హంగామా ఏమిటో చూడాలి !! త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

More News

సుకుమార్ దర్శకుడు సాంగ్ ని విడుదల చేసిన రకుల్ ప్రీత్ సింగ్!

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అదే దర్శకుడితో మరోసారి...

నేచురల్ స్టార్ నాని వరస విజయాలతో దూసుకుపోతున్నాడు.

అంతర్జాతీయ ఇండీ గేదరింగ్ అవార్డు గెలుచుకున్న 'రక్తం'

సామాజిక వేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ ఈ సినిమాను సమర్పణలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ `నా బంగారు తల్లి` డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ రూపొందిస్తున్న చిత్రం `రక్తం`.

దేనికైనా రెడీ అంటున్న సల్మాన్ హీరోయిన్

సల్మాన్ ఖాన్తో కిక్ సినిమాలో చిందేసిన శ్రీలంక సొగసరి అందాల అరబోతతో ఆకట్టుకుంది. కేవలం సినిమాల్లోనే కాదు, బయట కూడా తాను దేనికైనా రెడీ అంటు సంకేతాలు పంపింది జాక్వెలిన్.

బాలయ్య సాంగ్

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం `పైసా వసూల్` శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భవ్య ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.