close
Choose your channels

కత్తి రెడ్డిగా బ్రహ్మానందం?

Monday, July 3, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

”కత్తి రెడ్డి ” టైటిల్ వినగానే షాక్ అవుతున్నారా ? ఈ కత్తి రెడ్డి .. ఎవరు ? ఏమా కథ అంటే .. టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం లీడ్ రోల్ లో నటించే సినిమా ! ”కత్తి రెడ్డి” .. ఎత్తితే .. దించడు` అనేది ట్యాగ్ లైన్ ? బ్రహ్మానందం లీడ్ రోల్ పోషించే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఖాన్ దాదా లాంటి తరహా లో ఈ పాత్ర సాగుతుందట.
పూర్తీ స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో కీ రోల్ లో రచ్చ రవి నటిస్తున్నాడు. వి రవివర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ మధ్య బ్రహ్మానందం క్రేజ్ బాగా తగ్గింది. ఒకప్పుడు బ్రహ్మానందం ఉంటేనే సినిమా చేస్తానని చెప్పిన హీరోలు ఉన్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం లేకుండానే చాలా సినిమాలు వస్తున్నాయి. సినిమాలో మళ్ళీ తన హవా చాటుకోవడానికి బ్రహ్మానందం ప్రయత్నాలు మొదలు పెట్టాడు, ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఓకే చెప్పాడు. సో ఈ కత్తి రెడ్డి చేసే హంగామా ఏమిటో చూడాలి !! త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.