మళ్లీ షూటింగ్స్‌కు బ్రేకులు

  • IndiaGlitz, [Wednesday,June 24 2020]

క‌రోనా దెబ్బ‌కు అన్నీ వ్య‌వ‌స్థ‌లు స్థ‌బ్దుగా మారాయి. ఘోరంగా దెబ్బ తిన్న రంగాల్లో సినిమా, టీవీ రంగాలు వ‌చ్చి చేరాయి. ఈ రెండింటిలో షూటింగ్స్ నిరంత‌రం చేస్తుండాలి. క‌రోనా భ‌యంతో ఈ షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఒక లాక్‌డౌన్‌లో అంతా స‌ర్దుకుంటుందని అనుకున్నారు. త‌ర్వాత కూడా కంటిన్యూ కావ‌డంతో షూటింగ్స్ దాదాపు రెండు నెల‌లు పాటు నిలిచిపోయాయి. షూటింగ్స్ ఆగిపోవ‌డంతో సినీ కార్మికులు చాలా ఇబ్బందులు ప‌డ్డారు. దీంతో సినీ ప్ర‌ముఖులు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌ను క‌లిసి షూటింగ్స్‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరారు. ప్ర‌భుత్వాలు కూడా విధి విధానాల‌తో షూటింగ్స్‌కు అనుమ‌తులు ఇచ్చాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

కానీ క‌రోనా ప్ర‌భావం ఇప్పుడు షూటింగ్స్‌ను తాకాయి. ముఖ్యంగా టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించే న‌టుడు ప్ర‌భాక‌ర్‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అంద‌రూ భ‌య‌ప‌డుతున్నారు. క‌రోనా సోకిన వ్య‌క్తితో పాటు షూటింగ్స్‌లో పాల్గొన్న వారంద‌రికీ భ‌యం ప‌ట్టుకుంది. దీంతో టీవీ రంగానికి చెందిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు మీటింగ్ ఏర్పాటు చేసుకుని కొన్నాళ్ల పాటు షూటింగ్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. రెండు, మూడు రోజుల్లో మ‌ళ్లీ షూటింగ్స్ మొద‌లు పెట్టే విష‌యమై నిర్ణ‌యం తీసుకుంటార‌ని స‌మాచారం.

More News

బిత్తిరి సత్తిని టీవీ9 తొలగించిందా? లేదంటే ‘బిగ్‌బాస్’ కారణమా?

ఇటీవలి కాలంలో వీ6 ఛానల్ నుంచి బయటకు వచ్చి వార్తల్లో నిలిచిన బిత్తిరిసత్తి అలియాస్ చేవెళ్ల రవి మరోసారి చర్చనీయాంశంగా మారాడు.

తెలంగాణలో మరింత ఉధృతమవుతోన్న కరోనా

తెలంగాణలో పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతోంది. కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది.

ఏపీలో 10 వేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేల మార్క్ దాటింది. 36 వేల 47 శాంపిల్స్‌ను పరీక్షించగా..

సూర్యాకాంతం సీరియల్ షూటింగ్ ప్రారంభమైన కాసేపటికే ప్యాకప్..

గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో సీరియల్స్ షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. కొన్ని ఛానళ్లలో సీరియల్స్ ఇప్పటికే ప్రారంభమవగా..

ఆసక్తి పెంచుతున్న ‘భానుమతి రామకృష్ణ’ టీజర్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకు ప్రారంభ‌మైన ప‌క్కా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’.