close
Choose your channels

సూర్యాకాంతం సీరియల్ షూటింగ్ ప్రారంభమైన కాసేపటికే ప్యాకప్..

Wednesday, June 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్యాకాంతం సీరియల్ షూటింగ్ ప్రారంభమైన కాసేపటికే ప్యాకప్..

గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో సీరియల్స్ షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. కొన్ని ఛానళ్లలో సీరియల్స్ ఇప్పటికే ప్రారంభమవగా.. కొన్ని ఛానళ్లలో మాత్రం ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వడివడిగా షూటింగ్స్ నడుస్తున్నాయి. అయితే ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారమవుతున్న సూర్యాకాంతం అనే సీరియల్ మాత్రం షూటింగ్ ప్రారంభమైన కాసేపటికే ప్యాకప్ చెప్పేశారు.

కారణం.. ఆ సీరియల్‌లో నటిస్తున్న ప్రభాకర్ అనే నటుడికి కరోనా పాజిటివ్ అని తేలడమే. షూటింగ్ సడెన్‌గా ఆగిపోవడమే కాకుండా క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం కరోనా టెస్టు చేయించుకునేందుకు వెళ్లింది. మరో ఛానల్‌లో ప్రసారమవుతున్న సీరియల్‌లో పోసానికి అసిస్టెంట్‌గా ప్రభాకర్ నటించారు. దీంతోపాటు మరికొన్ని సీరియల్స్‌లోనూ ఆయన నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.