నిఖిల్ కి జోడీగా కేథరిన్

  • IndiaGlitz, [Tuesday,January 09 2018]

విభిన్న పాత్రలను చేయడానికి ముందుండే క‌థానాయ‌కుల‌లో యంగ్ హీరో నిఖిల్ ఒక‌రు. ప్రస్తుతం ఈ హీరో నటించిన కిర్రాక్ పార్టీ' సినిమా ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధంగా ఉంది. కన్నడంలో విజయం సాధించిన కిరిక్ పార్టీ' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో నిఖిల్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. మ‌రో రీమేక్‌కి కూడా నిఖిల్ తాజాగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

2016లో విడుద‌లై తమిళంలో ఘన విజయం సాధించిన థ్రిల్లర్ ఫిలిం కణితన్'ని.. తెలుగులో రీమేక్ చేయ‌డానికి చాన్నాళ్లుగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు ఆ రీమేక్‌లో న‌టించ‌డానికి నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఈ మూవీ తెలుగు హక్కుల్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సొంతం చేసుకున్నారు. తమిళ్ లో కథానాయికగా నటించిన కేథరిన్‌నే తెలుగులో కూడా నటించనుంద‌ని తెలిసింది. అలాగే తమిళ్ వెర్షన్ని డైరెక్ట్ చేసిన టి.ఎన్.సంతోష్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మార్చి నుంచి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న‌ ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను నిర్మాత త్వరలోనే వెల్లడిస్తారు.