రెహ‌మాన్ ఇంట సంబ‌రాలు!

  • IndiaGlitz, [Monday,June 17 2019]

రెహ‌మాన్ ఇంట్లో సంబ‌రాలు జ‌రుగుతున్నాయి. ఆయ‌న ఫ్యామిలీకి మ‌రోసారి అంత‌ర్జాతీయ గుర్తింపు ద‌క్కింది. రెహ‌మాన్ అక్క కొడుకు, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, హీరో అయిన జీవీ ప్ర‌కాష్ న‌టించిన సినిమాకు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కింది. జీవీ ప్ర‌కాష్ హీరోగా న‌టించిన సినిమా 'స‌ర్వం తాళ‌మ‌యం'. 'కండుకొండేన్ కండుకొండేన్' (తెలుగులో ప్రియురాలు పిలిచిందిగా విడుద‌లైంది) చిత్రం త‌ర్వాత ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్‌మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. మేన‌ల్లుడి సినిమాకు తొలిసారి రెహ‌మాన్ సంగీతాన్ని అందించారు.

ఇందులో మృదంగ విద్వాంసుడు కావాల‌నుకుంటాడు హీరో. అత‌ను క్రైస్త‌వుడు. అయినా ప‌ట్టుద‌ల‌తో నేర్చుకుంటాడు. ఆ కాన్సెప్ట్ ప్ర‌ధానంగా ఈస్తెటిక్ సెన్స్ తో తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. అప‌ర్ణ బాల‌ముర‌ళి నాయిక‌గా న‌టించారు. నెడుముడి వేణు, కుమార‌వేల్‌, వినీత్‌, దివ్య‌ద‌ర్శిని కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా వ‌ర‌ల్డ్ ప‌నోర‌మ‌లో షాంగై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు సెల‌క్ట్ అయిన‌ట్టు జీవీ ప్ర‌కాష్ ట్వీట్ చేశారు. జులై 15 నుంచి 24 వ‌ర‌కు ఈ వేడుక చిత్రోత్స‌వం జ‌ర‌గ‌నుంది. అంతర్జాతీయ గుర్తింపు పొంద‌డం ప‌ట్ల చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది.

More News

ఈ నెల 21న 'స్టూవర్టుపురం' మూవీ విడుదల

అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో గూఢచారి ఫేమ్ ప్రీతి సింగ్ ప్రధానపాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో

వైఎస్ జగన్ కాన్వాయ్‌ వాహనాలు ఎందుకు మార్చినట్లు!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ వాహనాల్లో మార్పు చోటుచేసుకుంది.

జులై 5న 'రాజ్‌దూత్‌' విడుదల

స్వర్గీయ రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'రాజ్‌ దూత్‌'. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు.

'డియ‌ర్ కామ్రేడ్‌' కి రిపేర్లు

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం సెన్సేష‌న‌ల్ హీరో అనే క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

చైత‌న్య‌తో స‌మంత‌

అక్కినేని నాగార్జున ప్ర‌స్తుతం `మ‌న్మ‌థుడు 2` సినిమాతో బిజీగా ఉన్నారు. దీని త‌ర్వాత క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో