రెహమాన్ ఇంట సంబరాలు!
Send us your feedback to audioarticles@vaarta.com
రెహమాన్ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి. ఆయన ఫ్యామిలీకి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. రెహమాన్ అక్క కొడుకు, ప్రముఖ సంగీత దర్శకుడు, హీరో అయిన జీవీ ప్రకాష్ నటించిన సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. జీవీ ప్రకాష్ హీరోగా నటించిన సినిమా `సర్వం తాళమయం`. `కండుకొండేన్ కండుకొండేన్` (తెలుగులో ప్రియురాలు పిలిచిందిగా విడుదలైంది) చిత్రం తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్‌మీనన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. మేనల్లుడి సినిమాకు తొలిసారి రెహమాన్ సంగీతాన్ని అందించారు.
ఇందులో మృదంగ విద్వాంసుడు కావాలనుకుంటాడు హీరో. అతను క్రైస్తవుడు. అయినా పట్టుదలతో నేర్చుకుంటాడు. ఆ కాన్సెప్ట్ ప్రధానంగా ఈస్తెటిక్ సెన్స్ తో తెరకెక్కించారు దర్శకుడు. అపర్ణ బాలమురళి నాయికగా నటించారు. నెడుముడి వేణు, కుమారవేల్, వినీత్, దివ్యదర్శిని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా వరల్డ్ పనోరమలో షాంగై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సెలక్ట్ అయినట్టు జీవీ ప్రకాష్ ట్వీట్ చేశారు. జులై 15 నుంచి 24 వరకు ఈ వేడుక చిత్రోత్సవం జరగనుంది. అంతర్జాతీయ గుర్తింపు పొందడం పట్ల చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.