దక్షిణాదిలో రెండో రాజధానిపై తేల్చేసిన కేంద్రం

  • IndiaGlitz, [Wednesday,November 27 2019]

దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేసే అవకాశం ఉందని గత కొన్ని రోజులు మీడియాలో కథనాలు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావుడి జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ రెండో రాజధానిపై మాత్రం వార్తలు ఆగలేదు. దీంతో కేంద్రం ఏదో ఒకటి తేల్చేయాలని బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు.

క్లారిటీ ఇచ్చేసిన కేంద్రం!
దక్షిణ భారతదేశంలో దేశానికి రెండో రాజధాని అవసరమని ప్రభుత్వం భావిస్తుందా..? అని పరోక్షంగా హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిని చేసే ఆలోచన ఉందా..? అని ప్రశ్నించారు. ఇందుకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. దేశానికి రెండో రాజధాని ప్రతిపాదన ఏదీ లేదని ఆయన తేల్చిచెప్పారు.

కాగా.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దేశానికి రెండో రాజధాని చేస్తారని గత కొద్ది కాలంగా తీవ్రంగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. దేశానికి మధ్యలో ఉన్న హైదరాబాద్‌ను రెండో రాజధానిగా ప్రకటించడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని.. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఈ వాదన మరోసారి తెరమీదకు వచ్చింది. దీంతో తాజాగా కేంద్రం ఈ వ్యవహారం తేల్చేసింది.

More News

‘మహా’నాట పదవుల పంపకాలు పూర్తి..!

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

'మహా' పాలిటిక్స్ కమల్‌‌కు ముందే తెలుసా!

మహారాష్ట్ర రాజకీయాలు మినిట్ టూ మినిట్ మారిపోతున్నాయ్.. అసలు ఎప్పుడు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో..?

కాపులు, ఆటోవాలా, స్టూడెంట్స్‌కు సీఎం జగన్ శుభవార్త

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కాపులు, ఆటోవాలాలు, విద్యార్థులకు శుభవార్త అందించారు.

‘కమ్మరాజ్యంలో.. మూవీపై ఆర్జీవీ షాకింగ్ విషయం

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’.

'90 ML' ఇది తాగుబోతుల సినిమా కాదు: డైరెక్టర్ శేఖర్ రెడ్డి

`ఆర్ ఎక్స్ 100` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం తీసిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ `90 ఎం.ఎల్‌` సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.