close
Choose your channels

కాపులు, ఆటోవాలా, స్టూడెంట్స్‌కు సీఎం జగన్ శుభవార్త

Wednesday, November 27, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాపులు, ఆటోవాలా, స్టూడెంట్స్‌కు సీఎం జగన్ శుభవార్త

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కాపులు, ఆటోవాలాలు, విద్యార్థులకు శుభవార్త అందించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చిన హామీని నేరవేర్చిన విషయం తెలిసిందే. అర్హులైన ఆటో యజమానులకు వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10 వేల ఆర్థికసాయం అందించడం జరిగింది. కాగా.. రెండో విడత, కాపు కార్పోరేషన్‌తో పలు విషయాలపై బుధవారం నాడు కేబినెట్ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం లభించింది. భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఆటో మీద జీవించే వారికి ఈ పథకం వర్తింపజేశామని, అర్హులందరిని విస్తృతంగా గుర్తించి రెండో విడతలో కూడా వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా డబ్బులు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. మొదటి విడతలో మిగిలిపోయిన వారిని రెండో విడతలో గుర్తించామన్నారు.

రెండో విడతలో 65,054 మంది దరఖాస్తు చేసుకోగా, 62, 630 మందిని లబ్ధిదారులుగా గుర్తించి ఒక్కొక్కరికి రూ.10 వేల ఆర్థిక సాయం ఈ రోజు మంత్రి పేర్నినాని మంజూరు చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారుల ఖాతాల్లోకి మంత్రి పేర్ని నాని డబ్బులు జమా చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్నినాని మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏలూరులో వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభిస్తున్న సమయంలో ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే అక్టోబర్‌ మాసం వరకు గడువు పెంచారన్నారు. భార్య పేరు మీద ఆటో ఉంటే భర్తకు డబ్బులు ఇచ్చామన్నారు. మార్పులు, చేర్పులు చేసి సులభతరం చేశామన్నారు. వెసులుబాటు కలిగించిన తరువాత 65054 మంది ఆక్టోబర్‌ మాసం వరకు దరఖాస్తు చేసుకోగా, వారిలో 62637 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. వారందరికీ కూడా రెండో విడత కింద ఈ రోజు డబ్బులు జమా చేస్తున్నామన్నారు.

కేబినెట్‌ ఆమోదించిన మరికొన్ని ముఖ్య విషయాలు..

వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి రూ.1101 కోట్లు కేటాయింపు. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15 వేల ఆర్థికసాయం అందించడానికి, 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75 వేలు అందజేసేందుకు ఆమోదం.

టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంపు

నవశకం సర్వే ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయం.

కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెదదండ్లూరు వద్ద 3,200 ఎకరాల్లో
నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ కు డిసెంబర్ 26న శంకుస్థాపనకు, ఇనుప ఖనిజం కోసం ఎన్ఎండీసీతో ఒప్పందానికి ఆమోదం.

ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం

సంక్షేమ పథకాల కింద వేర్వేరు కార్డుల జారీకి, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి, ఆంధ్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ కు బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు, మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.

జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.2,300 కోట్లు, జగనన్న విద్యా దీవెన పేరిట ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూ.3,400 కోట్లు కేటాయింపు.

ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి, కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

ఏపీఎస్పీడీసీఎల్ ను విభజించి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.