వైసీపీలోకి చంద్రబాబు బినామీ.. కీలకనేతతో గంటన్నర చర్చలు!?

  • IndiaGlitz, [Wednesday,June 19 2019]

ఇదేంటి.. టైటిల్ చూడగానే కాసింత ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవును ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా మారిపోతున్నాయ్. అదేదో పాట ఉంది కదా.. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లుగా ఎవరు ఏ క్షణాన ఉన్న పార్టీ నుంచి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. మరీ ముఖ్యంగా అటు అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్.. టీవీ చానెల్స్ డిబెట్లలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పడంతో అసలేం జరుగుతోందో అని ఆ పార్టీ అధినేత, తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ మొదలైంది.

ఇక అసలు విషయానికొస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రముఖ బిజినెస్‌మెన్, రాజ్యసభ్యుడు సీఎం రమేష్ బినామీల్లో ఒకరు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయం పలు సందర్భాల్లో నిరూపితమైందని కూడా విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఆయన చంద్రబాబుకు సడన్ షాకిచ్చి.. టీడీపీకి టాటా చెప్పబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు కారణం వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో రమేష్ మంతనాలు జరపడమేనని తెలుస్తోంది. ఇంతకీ సీఎం రమేష్ ఎందుకు విజయసాయిరెడ్డిని కలిశారు..? ఎక్కడ కలిశారు..? ఎందుకింత రచ్చ జరుగుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

పార్లమెంట్ వేదికగా అసలేం జరిగింది..!?

మంగళవారం నాడు లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌లు పక్కపక్కనే కూర్చొని సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఓ వైపు కొత్త ఎంపీలు ప్రమాణం చేస్తుండగా.. ఈ ఇద్దరు రాజ్యసభ ఎంపీలు మాత్రం సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. అంతేకాదు ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకోవడం.. తర్వాత విజయసాయిరెడ్డి ముందు వరుసకు వచ్చి సీఎం రమేశ్‌ పక్కన కూర్చొవడం ఇవన్నీ చూసిన సభికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఉప్పు-నిప్పులా.. వీరిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉండేది కదా.. ఇంత క్లోజ్ ఎలా అయ్యారబ్బా..? అని అటు వైసీపీ.. ఇటు టీడీపీ ఎంపీలు కంగుతిన్నారు.

గంటన్నరపాటు చర్చలు!

ఇలా ఐదు పది నిమిషాలు కాదు ఏకంగా సుమారు గంటన్నరకుపైగా వారిద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించడంతో వైసీపీలో చేరడానికి రమేష్‌కు లైన్ క్లియర్ అయ్యిందని వార్తలు వినవస్తున్నాయి. అయితే.. సమావేశాలు అనంతరం.. మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి పొంతనలేని మాట్లాడారు. అంతేకాదు.. మీ హయాంలో ఏమేం చేశారో చెప్పమని రమేశ్‌ను అడిగానంతే అంతకు మించి ఏమీలేదని బదులివ్వడం గమనార్హం. సో.. రమేష్ నిజంగానే వైసీపీలో చేరుతారా..? లేకుంటే మాటలకే పరిమితమై ఇవన్నీ పుకార్లుగానే మిగిలిపోతాయా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. మాజీ ఎంపీ జంప్

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. దేశ వ్యాప్తంగా విస్తరించాలని మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘కమలం’ పార్టీ ఏంటో చూపించాలని తహతహలాడుతోంది.

జాలి చూపించండన్న జనసేన ఎమ్మెల్యే.. పడిపడి నవ్విన జగన్!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజున హాట్‌, హాట్‌గా ముగిశాయి. మంగళవారం నాడు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల మధ్య మాటల తూటాలు పేలాయి.

ఆగస్ట్ 15న ఈ 3 సినిమాల్లో ఏది చూస్తారు!?

సినిమా విడుద‌ల‌కి ముందే దుబాయ్‌లో ప్రివ్యూలు చూసి ఇటు సౌత్, అటు నార్త్ సినిమాలపై నెగెటివ్ రివ్యూలు రాస్తూ కమల్ ఆర్‌ ఖాన్ బాగా పాపులర్ అయ్యాడన్న సంగతి తెలిసిందే.

రెజీనా పెళ్లి కబురు

టాలీవుడ్లోగానీ, కోలీవుడ్‌లోగానీ రెజీనా పెళ్లి గురించి వ‌చ్చిన‌న్ని వార్త‌లు మ‌రే హీరోయిన్‌కూ వ‌చ్చి ఉండ‌వేమో.

రాజ్ త‌రుణ్ ని స‌మ్మోహ‌న‌ప‌ర‌చ‌నుందా?

టాలీవుడ్‌లో స‌క్సెస్ అర్జంటుగా కావాల్సిన హీరోల్లో రాజ్ త‌రుణ్ ఒక్క‌డు.