గెలుస్తామని బాబుకు ధీమా... మరోవైపు భయం!!

  • IndiaGlitz, [Monday,April 22 2019]

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. సోమవారం నాడు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. 100 శాతం కాదు.. 1000 శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కోసం క్యూలో వుండి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞలు చెప్పాలని అభ్యర్థులకు చంద్రబాబు సూచించారు. ఎన్నికలు పూర్తయిన చోట్ల అభివృద్ధి కుంటుపడకుండా... ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా పాలన సాగాలని.. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలివ్వాలని బాబు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ధీమా ఓ వైపు.. మరోవైపు భయం..!

వెయ్యిశాతం గెలుస్తామని అంటూనే చరిత్రలో ఇంతటి దుర్మార్గపు ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. మనం మళ్లీ అధికారంలోకి రాకుండా అన్ని విధాలుగా కేంద్రం అడ్డుకుంటోందని బాబు అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా విజయం మనదేనని అభ్యర్థులకు ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఓ వైపు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే బాబులో ఒకింత భయం మాత్రం కనిపిస్తోందని బాబు మాటలను బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని వైసీపీ నేతలు, విమర్శకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

More News

ధోనీ బాదుడుకు చిన్నబోయిన చిన్నస్వామి!

ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మహేంద్ర సింగ్ ధోనీ పెద్దగా రాణించకపోవడంతో ఇక ధోనీ అయిపోయింది.. వయసు మీదికొచ్చింది కదా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది..

దేశానికి వైద్యం చేస్తోన్న ఈ ముగ్గురు డాక్ట‌ర్స్ ను అభినందించి, ఆశీర్వ‌దించాలిః 'ఎమ్ బిఎమ్' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో అతిథులు

ప్రత ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై భ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ వైద్యులు డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టి.ప‌ల్ల‌వి రెడ్డి  సంయుక్తంగా తొలిసారిగా నిర్మిస్తోన్న చిత్రం

శ్రీలంక మారణహోమంలో ఇద్దరు జేడీఏస్ నేతలు మృతి

వరుస బాంబు పేలుళ్లతో కొలంబోవాసులు కకావికలమయ్యారు. ఈస్టర్ డే నాడు జరిగిన ఈ మారణహోమంలో సుమారు 300మందికి పైగా మరణించగా..

రాజ్‌త‌రుణ్ కొత్త చిత్రం 'ఇద్ద‌రి లోకం ఒక‌టే' ప్రారంభం

ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. ఈ బ్యాన‌ర‌పై యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

గత మూడ్రోజులుగా స్టాక్ మార్కెట్స్‌ నష్టాలతోనే ముగుస్తున్నాయి.!. ఈ నెల మొదట్లో రేసు గుర్రాల్లా పరుగులు తీసిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు చతికిలపడ్డాయి. సోమవారం దేశీయ మార్కెట్స్ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.