close
Choose your channels

మమత ఎఫెక్ట్: అమరావతిలో బాబు భారీ బహిరంగ సభ!

Sunday, January 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ప్రజలు, రాజకీయ నేతలు ఇప్పటికీ రగిలిపోతున్నారు. ఇప్పటికే ఎన్డీఏ నుంచి బయటికొచ్చేసిన టీడీపీ.. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి ఓ వైపు సీఎం మమత, సీఎం చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. జనవరి 19న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన 'యునైటెడ్ ఇండియా ర్యాలీ' గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్దలు, పార్టీల అధినేతలు హాజరై కనివీని ఎరుగని రీతిలో సక్సెస్ అయింది. బహుశా ఈ రేంజ్‌‌లో ప్రజలు, అభిమానులు వస్తారని దీదీ కూడా ఊహించివుండరేమో.

ఈ సభ సక్సెస్ కావడంతో ఏపీలో కూడా భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు 'ధర్మ పోరాట సభ' అని పేరు పెట్టడాలని అనుకున్న చంద్రబాబు ఇప్పటికే ఈ విషయమై కోల్‌కతాలోనే మిగతా పార్టీల అధినేతలు, రాజకీయ ఉద్ధండులు, పలువురు ప్రముఖులతో చర్చించినట్లుగా తెలుస్తోంది.

అయితే చంద్రబాబు అనుకుంటున్నట్లుగా ఈ సభ ఏ మేరకు సక్సెస్ కానుంది..? ఇప్పటికే చంద్రబాబు.. పలు పోరాట సభలకు ఏ మాత్రం జనాభా వచ్చిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. మళ్లీ మళ్లీ సభలు పెడుతున్న చంద్రబాబు సభలకు జనాలను ఏ రేంజ్‌‌లో తరలిస్తారో..? మరీ ముఖ్యంగా పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు ఈ సభకు ఆహ్వానం ఉంటుందా..? లేదా..? ఇలాంటి ఎన్నో అనుమానాలు నివృతి కావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.