కాన్ ట్రవర్సీ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన బోస్

  • IndiaGlitz, [Saturday,January 09 2016]

యంట్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...ఈ చిత్రాన్ని సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా ఈనెల 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం అందించ‌గా...మూడు పాట‌ల‌కు చంద్ర‌బోస్ సాహిత్యం అందించారు. అయితే ఈ సినిమా కోసం చంద్ర‌బోస్ డోంట్ స్టాప్ డోంట్ ప్టాప్ అనే పాట రాసారు.
ఈ పాట‌లో... వాళ్లు నిన్ను విసిరేసాం అని అనుకోని వాళ్ళ‌కు తెలియ‌దు నువ్వు ఒక బంతివి అని...వాళ్లు నిన్ను న‌రికేసాం అని అనుకోని...వాళ్ల‌కు తెలియ‌దు నువ్వు ఒక‌ నీటి దార‌వ‌ని... వాళ్లు నిన్ను పాతేసాం అని అనేకోని వాళ్ళ‌కు తెలియ‌దు నువ్వు ఒక‌ విత్త‌నం అని...విత్త‌న‌మై మొల‌కెత్తు..బంతిలాగా పైకి ఎగురు...వ‌ర‌ద‌లాగ ఉప్పొంగు డోంట్ స్టాప్ డోంట్ స్టాప్...అని రాసారు. ఇది ఎన్టీఆర్ వ్య‌క్త‌గ‌త జీవితాన్ని ద్రుష్టిలో పెట్టుకుని రాసారంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ విష‌యం గురించి గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్ ని అడిగితే...ఈ పాట‌లో కాన్ ట్ర‌వ‌ర్సీ ఏమీ లేదు. అంతా క‌థ‌లో భాగ‌మే. సుక్కు ఫిలిమ్స్ లో ఒక్క విష‌యం కుడా సంబంధం లేకుండా ఉండ‌దు అన్నారు. మ‌రి...ఇది నిజ‌మేనంటారా..?

More News

చిరుని టార్గెట్ చేసిన శంకర్..

చిరు ని టార్గెట్ చేసిన శంకర్...అనగానే ఎన్.శంకరో...వీర శంకరో...రోబో శంకరో అనుకుంటే పొరపాటే.మరి..ఎవరంటారా షకలక శంకర్.

మ‌హేష్ క‌థ పై క్లారిటీ ఇచ్చిన మురుగుదాస్

సూపర్ స్టార్ మ‌హేష్, క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్...ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రూపొంద‌నున్న చిత్రం త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

వరుణ్ తేజ్ హీరోయిన్ ఆమెనా?

గతేడాది రామ్ చరణ్ సరసన బ్రూస్ లీ చిత్రంలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది నాన్నకు ప్రేమతో సినిమాతో పాటు సరైనోడు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన అదృష్ఠాన్ని పరీక్షించుకోనుంది.

సుశాంత్ ... శర్వానంద్ లో ఎవరు కరెక్ట్...

సుశాంత్..జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఆటాడుకుందాం..రా అనే సినిమా చేస్తున్నాడు.

రెజీనా చాన్స్ ను మిస్తీ కొట్టేసింది....

చిన్నదాన నీకోసం చిత్రంలో సందడి చేసిన తేనె కళ్ళ సుందరి మిస్తి చక్రవర్తి తన రెండో సినిమాగా కొలంబస్ చిత్రంలో నటించింది.