చరణ్ సినిమా.. 'కిక్' ఫార్ములా..

  • IndiaGlitz, [Saturday,April 02 2016]

'ఎవ‌డు' త‌రువాత స‌రైన విజ‌యం అందుకోలేక‌పోయిన‌ రామ్‌చ‌ర‌ణ్.. త‌న కొత్త చిత్రంపై బోలెడు ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా.. త‌మిళంలో విజ‌యం సాధించిన 'త‌ని ఒరువ‌న్‌'కి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో చ‌ర‌ణ్‌కి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

చ‌ర‌ణ్‌తో ర‌కుల్ జ‌త‌క‌ట్టిన 'బ్రూస్ లీ' ప‌రాజ‌యం పాలైనా.. త‌న ద‌ర్శ‌క‌త్వంలో ర‌కుల్ న‌టించిన 'కిక్ 2' ఫెయిలైనా.. ఆమెకి వెంట‌నే మ‌రో అవ‌కాశం ఇవ్వ‌డానికి సురేంద‌ర్ రెడ్డికున్న సెంటిమెంట్ కూడా ఓ కార‌ణ‌మ‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత‌కీ అదేమిటంటే.. సురేంద‌ర్ హిట్ చిత్రాల‌లో ఒక‌టైన 'కిక్' కోసం కూడా.. 'ఖ‌తర్నాక్' సినిమాతో ఫ్లాప్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ర‌వితేజ‌, ఇలియానా ని జోడీ చేసి హిట్ కొట్టిన వైనం. ఇప్పుడు ఇదే ఫార్ములాని 'బ్రూస్‌లీ'తో ఫ్లాప్ పెయిర్‌గా నిలిచిన చ‌ర‌ణ్‌, ర‌కుల్‌కి అప్ల‌య్ చేసి.. త‌న హిట్ సెంటిమెంట్‌ని మ‌రోసారి రిపీట్ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట సూరి.

More News

అడ‌వి శేష్ తో అభిషేక్ పిక్చ‌ర్స్..

క్ష‌ణం సినిమాలో హీరోగా న‌టించ‌డంతో పాటు క‌థ - స్ర్కీన్ ప్లే అందించిన మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అడ‌వి శేష్. క్ష‌ణం సినిమాకి ముందు బాహుబ‌లి, పంజా, కిస్, క‌ర్మ‌ చిత్రాల్లో న‌టించినా...అడ‌వి శేష్ కి  హీరోగా స‌క్సెస్ అందించింది మాత్రం క్ష‌ణం చిత్రం.

లజ్జ ఫేమ్ వరుణ్ ఇంటర్వ్యూ....

కొందరు వ్యాపారం కోసం సినిమాలు తీస్తారు.మరి కొందరు అభిరుచి కోసం సినిమాలు తీస్తారు.ఇంకొందరు మేము కూడా సినిమా తీసాం అనిపించుకోవాలని కూడా తీస్తారు.

మ‌నోజ్ ను చూసి మిగ‌తా హీరోలు నేర్చుకోవాలి..

మంచు మ‌నోజ్ న‌టించిన తాజా చిత్రం ఎటాక్. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో మ‌నోజ్ న‌టించిన ఎటాక్ ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యింది. ప్ర‌కాష్ రాజ్, జ‌గ‌ప‌తిబాబు, వ‌డ్డే న‌వీన్ ముఖ్య‌పాత్ర‌లు పోషించిన ఎటాక్ సినిమా ఏమాత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది.

త్రిష 'నాయకి' కి ఇబ్బందులు తప్పవా?

తెలుగు ప్రేక్షకులకి నాయకి త్రిష పన్నెండేళ్లుగా సుపరిచితం.కెరీర్ ప్రారంభంలో మంచి క్రేజ్ ని మూటగట్టుకున్నా..

కేక పుట్టిస్తున్న స‌ర్ధార్ ఐటం సాంగ్..

గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక‌...అనే ఐటం సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాట‌ను దేవిశ్రీప్ర‌సాద్ మ్యాజిక్ (మ్యూజిక్)తో అదిరింది అనిపించారు. ఇప్పుడు స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ఐటం సాంగ్  కెవ్వు కేక‌ను మించేలా ఉంది.