నిశ్చితార్థంపై రానా-నాని మధ్య చాటింగ్.. క్లారిటీ

  • IndiaGlitz, [Friday,May 22 2020]

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ ప్రేమించి.. పెద్దలను ఒప్పించి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. నిశ్చితార్థం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేదు. అయితే.. ఇరు కుటుంబీకులు మాత్రం నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్ గురించి మాత్రమే చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. లాక్ డౌన్‌ కావడంతో సెలబ్రిటీలు కూడా ఎక్కడికక్కడ ఉండిపోయారు. దీంతో రానా ఎంగేజ్మెంట్ అయ్యిందా..? లేదా అని తెలుసుకోవడానికి పలువురు నటీనటులు తెగ ఆసక్తి చూపారు. ముఖ్యంగా రానాకు ఆప్తుడు అయిన నేచురల్ స్టార్ నాని.. కొత్త పెళ్లికొడుకుతో వాట్సాప్‌లో చాట్ చేశాడు.. దీంతో అసలేం జరిగిందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రానా పోస్ట్ చేశాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వాట్సాప్ సంభాషణ ఇదీ..
నాని : అబ్బాయ్ ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా..!?
రానా : లేదు రోకా ఫంక్షన్ మాత్రమే..

నాని : రోకా ఫంక్షన్ అంటే.. నాకు తెలియదులే గూగుల్‌లో సెర్చ్ చేస్తా..
రానా : నవ్వుతున్నట్లున్న ఎమోజీలు పోస్ట్ చేశాడు..
నాని : ఫైనల్‌గా పగలబడి నవ్వుతున్న ఎమోజీలతో కూడిన చాటింగ్ వీరిద్దరి మధ్య జరిగింది.

రోకాకు అర్థం ఇదీ..!
కాగా.. ‘రోకా’ అంటే.. వధూవరుల కుటుంబాలు ఒకరినొకరు కలుసుకొని నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన విషయాల గురించి చర్చించడం అని అర్థం. ఈ రోకా జరిగిందంటే పెళ్లి పనులు షురూ అయ్యాయని అర్థమన్నమాట. మరోవైపు రోకాకు సంబంధించి ఫొటోలను మిహీకా కూడా ఇన్ స్టాలో షేర్ చేసింది. మొత్తానికి చూస్తే అతి త్వరలోనే దగ్గుబాటి ఇంట అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుందని తెలుస్తోంది. మరి నిశ్చితార్థం ఎప్పుడు జరుగుతుందో.. పెళ్లి తారీఖు ఎప్పుడు ఫిక్స్ చేస్తారో అని భల్లాలదేవుడి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More News

ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ పదే పదే పిలిచే రాహుల్ ఈయనే..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే చాలు ఎక్కువగా వినపడే పేరు రాహుల్.. రాహుల్..? ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ రాహుల్ క్వశ్చన్ వేయకుండా ఉండరు..?

ఆర్బీఐ ప్రకటనతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

కరోనా కష్టకాలంలో ఆర్బీఐ పలు కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంకుల నుంచి లోన్లు

మరో 3 నెలలు ఈఎంఐ లోన్లు కట్టక్కర్లేదు.. ఆర్బీఐ కీలక ప్రకటన

కరోనా కష్టకాలంలో ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ తాజాగా మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా కష్టకాలంలో ఆర్బీఐ మరో శుభవార్త

కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతోంది. లాక్ డౌన్‌తో ఎలాంటి ఆదాయం లేక జనాలు ఇబ్బందులు పడుతున్న కష్టకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తియ్యటి శుభవార్త చెప్పింది.

బెంగాల్ 'అంఫన్' పెను బీభత్సం.. 72 మంది దుర్మరణం

సూపర్ సైక్లోన్ అంఫన్ గత రెండు మూడ్రోజులుగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కుదిపేస్తోంది. గురువారం నాడు ఈ తుఫాన్ మరింత ఉగ్రరూపం దాల్చి పెను బీభత్సం సృష్టించింది.