చాలా సినిమాలు ఈ తరాలకు అందట్లేదు.. భద్రపరుచుకోవాలి: చిరు

  • IndiaGlitz, [Monday,December 09 2019]

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్‌లో ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఐదవ ఫిల్మ్ ప్రిజర్వేషన్ అండ్ రీస్టోరేషన్ వర్కుషాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, శ్యామ్ బెనగల్, దర్శకధీరుడు రాజమౌళి, ప్రముఖ నిర్మాత అల్లు ఆరవింద్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సురేష్ బాబు, సుబ్బరామి రెడ్డిలు పాల్గొన్నారు. ఈ వేడుకకు వివిధ దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ వేడుక అన్నపూర్ణ స్టూడియో వేదికగా వారం రోజుల పాటు వర్క్‌షాప్ జరుగుతోంది. తెలుగు సినీ వారసత్వ సంరక్షణ లక్ష్యమే ఈ వర్కుషాప్ ఉదేశ్యం. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

చిరు మాట్లాడుతూ.. ‘నాకు ఎంతో పేరు తెచ్చిన ‘ఖైదీ’ సినిమా నెగిటివ్ కూడా లేదు పాత తరం నటుల ఎన్నో గొప్ప సినిమాలు భవిష్యత్తు.. అవి ఈ తరాలకు అందకుండా పోయాయి. ఇప్పటికైనా మిగతా సినిమాలను భద్రపరుచుకోవాలి’ అని చెప్పుకొచ్చారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘పాత సినిమాలను ఎందుకు భద్రపరచాలో.. ఎలా భద్రపరచాలో ఈ వర్కుషాప్ ద్వారా తెలుసుకోనున్నాం. ఇప్పటికే అనేక సినిమాలను భద్రపరచలేకపోయాం’ అని అన్నారు.

తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ‘ఒక్కో జనరేషన్ ఒక్కో విధమైన సినిమాలు రూపొందిస్తోంది. అన్ని రకాల సినిమాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బాధ్యత తీసుకున్న ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్‌కు అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాకారం అందిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాలను భద్రపరచాలనే అవగాహన మనకు లేదు. సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. డిజిటలైసెషన్ వచ్చినప్పటికీ కాలానుగుణంగా సినిమాల క్వాలిటీ తగ్గుతోంది. విలువైన వస్తువులను దాచుకున్నట్లే సినిమాలను దాచుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇంతటి గొప్ప కార్యక్రమానికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదికవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను నటించిన అనేక సినిమాల మంచి క్వాలిటీ నెగటివ్‌లు లేవు.. ఇది నాకు బాధ కలిగించే విషయం అని అన్నారు. కాగా ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

More News

'ఎంత మంచివాడ‌వురా' తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

`ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధ‌ముందో..

మైనస్ 4 డిగ్రీల చ‌లిలో 'వెంకీమామ‌' కోసం చైతు ప‌డ్డ క‌ష్టం

విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ‌`.

నాగ్ అశ్విన్ `ల‌స్ట్ స్టోరీస్‌`

హిందీలో విజ‌య‌వంత‌మైన ల‌స్ట్ స్టోరీస్ త‌ర‌హాలో ఓ తెలుగులో ల‌స్ట్‌స్టోరీస్ వెబ్ సిరీస్ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

డిసెంబర్ 11న అల వైకుంఠపురంలో టీజర్ !!!

'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం 'అల.. వైకుంఠపురంలో..' .

‘రూలర్’ ట్రైలర్ అదుర్స్..!

నందమూరి బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్ నటీనటులుగా కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం‘రూలర్‌’.