‘ఆచార్య’ షూటింగ్ అప్‌డేట్.. ఇల్లెందులో తిరిగి ఎప్పుడంటే..

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరుకి జంటగా స్టార్ హీరోయిన్ కాజల్ నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చెర్రీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. నక్సలైట్ నాయకుడిగా చెర్రీ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న సినిమా కావడం.. కొరటాల దర్శకుడు కావడంతో సినిమాలు అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాను నిరంజన్‌రెడ్డి, రామ్‌ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ఖమ్మం జిల్లా ఇల్లందులోని జేకే మైన్స్‌లో షూటింగ్ జరుగుతోంది. మంచి యాక్షన్ సన్నివేశాల కోసం కొరటాల ఈ ప్లేస్‌ను ఎంచుకున్నారు. కాగా.. ఈ నెల 15 వరకు జరగవలసిన ఆచార్య సినిమా షూటింగ్ వాయిదా పడింది.
అయితే తొలుత బొగ్గుగనిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా చిరు డీహైడ్రేషన్‌కు గురయ్యారని.. కాబట్టి వారం రోజుల్లో జరగాల్సిన షూటింగ్‌కు కేవలం మూడు రోజుల్లోనే ముగింపు పలికారని టాక్ వచ్చింది. తిరిగి ఇక్కడ షూటింగ్ నిర్వహిస్తారా? లేదా? అనేది కూడా సందేహంగా మారింది. వీటన్నింటిపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది.

‘ఆచార్య’ సినిమా షూటింగ్ తిరిగి ఈ నెల 12వ తారీఖున ఇల్లందు సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్స్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో సోన్‌సూద్ నటిస్తున్నారు. అయితే ఇల్లందు జేకే మైన్స్‌లో చిరు, సోనూసూద్‌ మధ్య జరిగే ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. అయితే మంగళవారం సడెన్‌గా ఇల్లందు నుంచి సినిమా యూనిట్ వెళ్లిపోయింది. మూడు రోజుల పాటు రామ్ చరణ్ చిరంజీవిల సన్నివేశాలు చిత్రీకరణ పూర్తి చేశారు. 10, 11 తేదీలలో హీరో సోనూసూద్‌తో ఫైటింగ్ సన్నివేశం చిత్రీకరించాల్సి ఉండగా ఆయన వేరే షూటింగ్‌లో ఉండటం వలన ఆచార్య సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు.

More News

విశాఖ ఉక్కు కోసం వీలైతే వైజాగ్ వెళ్లి పోరాడుతాం: కేటీఆర్

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయనున్నారనే వార్త ప్రస్తుతం ఏపీని కుదిపేస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసి తీరుతామని కొద్ది రోజులుగా కేంద్రం సంకేతాలిస్తోంది.

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్ నియమితులయ్యారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. కాగా.. సొంత పార్టీ నేతల అసమ్మతి కారణంగా సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

న్యూలుక్‌తో అభిమానులను మెస్మరైజ్ చేస్తున్న పవన్

దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. అటు రాజకీయాలను.. ఇటు సినిమా షూటింగ్‌లనూ

శశికళ అందుకే వెనక్కితగ్గారా? తమిళనాట రసవత్తరంగా రాజకీయం

ఇటీవల కాలంలో తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆది నుంచి సీఎం అభ్యర్థిగా ఉండాలని భావించిన శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లిపై గొడవకు దిగిన గ్రామస్తులు

‘కేజీఎఫ్’ హీరో.. కన్నడ స్టార్ యశ్ తల్లిపై ఆమె సొంత గ్రామస్తులంతా గొడవకు దిగారు. యశ్ తల్లి తమ పొలం నుంచి ఉన్న దారిని మూసివేయడంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు