శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షల సాయం

ఆపద అంటూ వస్తే నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.. దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోమ్ కవారెంటైన్ లో ఉంటున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకడంతో ఆయన కూడా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.

ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం అందించవలసిందిగా సినీ పెద్దలను కోరారు. విషయం తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన అజయ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు. అంతేకాక వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు మేమంతా ఉన్నాం అని అభయమిచ్చారు.

చిరంజీవిని కలిసి చెక్ తీసుకున్నతర్వాత అజయ్ మాట్లాడుతూ నాన్న గారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు అని వెల్లడించారు. చిరంజీవి గారు అంటే నాన్న గారికి ఎంతో అభిమానం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి గారితో సినిమాలు నాన్న గారు కలిసి చేశారని వెల్లడించారు. ఇటీవల ఆచార్య షూటింగులో కూడా నాన్నగారు చిరంజీవిని కలిశారని అజయ్ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి తనకి చాలా అవసరం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి గారు చేసిన సాయం ఎన్నటికీ మరువలేని ఆయనకి ఎన్నటికీ రుణపడి ఉంటానని అన్నారు.

More News

చావు బతుకుల్లో శివశంకర్ మాస్టర్: మీకంటే ధనుష్, సోనూసూద్‌లే నయం..  తెలుగు స్టార్స్‌పై నెటిజన్ల ఫైర్

అప్పుడప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమ విచిత్రంగా ప్రవర్తిస్తూ వుంటుంది. ప్రకృతి విపత్తులు,

కెరీర్‌లోనే బిగ్గెస్ట్ స్టెప్ .. హాలీవుడ్‌లోకి సమంత..!!

జీవితంలో ఒడిదొడుకులు సహజమే. విజయానికి సంబరపడకుండా.. కష్టానికి కృంగిపోకుండా నిలబడేవాడే జీవితాన్ని గెలుస్తాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ఆ అబ్బాయితో ఏంటలా.. సిరికి తల్లి వార్నింగ్, హర్టయిన షణ్ముఖ్‌

బిగ్‌బాస్ 5 తెలుగు తుది అంకానికి చేరుకుంది. దీంతో ఇప్పటి వరకు వీడియోలు, ఆడియో,

విడాకులు: ఎంత చెప్పినా వినరే.. ఈ సారి వీడియోను వదిలిన ప్రియాంక- నిక్

బాలీవుడ్ సెలబ్రెటీ కపుల్.. ప్రియాంక చోప్రా- నిక్ జోన్స్ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడటం లేదు.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 91వ సినిమా 'శేఖర్' గ్లింప్స్‌ విడుదల

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'శేఖర్'. హీరోగా ఆయన 91వ చిత్రమిది.