close
Choose your channels

విడాకులు: ఎంత చెప్పినా వినరే.. ఈ సారి వీడియోను వదిలిన ప్రియాంక- నిక్

Friday, November 26, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ సెలబ్రెటీ కపుల్.. ప్రియాంక చోప్రా- నిక్ జోన్స్ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడటం లేదు. ప్రియాంక తన భర్త నిక్‌ జోనస్‌ ఇంటి పేరు తొలగించడంతో రాజుకున్న ఈ వివాదానికి స్వయంగా ప్రియాంక చెక్ పెట్టాలని చూసినా వీలు కాలేదు. ఓ వీడియో షేర్‌ చేసి తమ విడాకులపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇవ్వకనే ఇచ్చింది. అయినా నిక్‌-ప్రియాంక విడాకులు కన్ఫర్మ్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ప్రియాంక తల్లి మధు చోప్రా రంగంలోకి దిగారు. ఆమె మాటలను కూడా నెటిజన్లు లెక్క చేయలేదు. ఇక లాభం లేదనుకుని స్వయంగా భర్తతో కలిసి ప్రియాంక మరో వీడియోను రిలీజ్ చేశారు.

ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ రూమార్లకు చెక్‌ పెట్టారు. ఈ ఫొటోను నిక్‌ షేర్‌ చేస్తూ.. ‘అందరికి థ్యాంక్స్‌ గివింగ్‌ శుభాకాంక్షలు! ప్రియాంక మీకు కూడా కృతజ్ఞతలు’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్‌ బీటౌన్‌లో వైరల్‌గా మారింది. దీంతో ప్రియాంక ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. తమ ఫేవరేట్ హీరోయిన్ .. భర్త నుంచి విడిపోవడం లేదన్న మాట అంటూ సంబరపడుతున్నారు. రూమర్స్‌కు చెక్ పెట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగిన నిక్‌కు అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

కాగా.. తన కంటే వయసులో దాదాపు పదేళ్లు చిన్నవాడైన నిక్‌ను 2018లో పెళ్లాడారు ప్రియాంక చోప్రా. అమెరికా- ఇండియాల మధ్య చక్కర్లు కొడుతూ వ్యక్తిగత విషయాలు, విహార యాత్రలు, సినిమాలు ఇతర ఈవెంట్‌లకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునేవారు. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రోఫైల్‌ పేరు నుంచి భర్త నిక్‌ జోనస్‌ పేరును తొలిగించింది. అది చూసి ఆమె ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ అంతా షాక్‌కు గురయ్యారు. అంతేకాదు వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ మూడు రోజుల నుంచి సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.