రాజమౌళి వల్ల ఆలస్యమవుతున్న చిరంజీవి చిత్రం

మెగాస్టార్ చిరంజీవి త‌న‌ 152వ చిత్రాన్నికొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సినిమాను ఆగ‌స్ట్ 14 లేదా 15న విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమా విడుద‌ల వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డింద‌ట‌. అందుకు కార‌ణం డైరెక్ట‌ర్ రాజ‌మౌళి అని టాక్‌. ఇంత‌కు చిరంజీవి సినిమాకు, రాజ‌మౌళికి ఏం సంబంధం అని అనుకుంటున్నారా? వివ‌రాల్లోకెళ్తే.. చిరు 152లో యంగ్ రోల్‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించాల్సి ఉంద‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ రాజ‌మౌళి 'ఆర్ఆర్ఆర్‌' సినిమాలో న‌టిస్తున్నాడు.ఈ సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కు మ‌రో సినిమాలో చ‌ర‌ణ్ న‌టించ‌కూడ‌ద‌నేది కండీష‌న్ అట‌. దీంతో చ‌ర‌ణ్ కోసం జూన్‌, జూలై వ‌ర‌కు కొర‌టాల అండ్ టీమ్ వెయిట్ చేయాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి ఎంటైర్ షూటింగ్ వాయిదా ప‌డుతుంద‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.

ఒక‌వేళ చిరు 152వ సినిమా వాయిదా ప‌డితే.. త‌దుప‌రి ఏంట‌నేది చిరు ఇప్ప‌టికే ప్లాన్ చేసేసుకున్నాడ‌ట‌. మ‌ల‌యాళ సినిమా రీమేక్‌లో చిరంజీవి న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసేశాడ‌ట‌. సుకుమార్ ఈ సినిమాను నిజానికి డైరెక్ట్ చేయాల్సింది. కానీ... బ‌న్నీ సినిమాతో సుక్కు బిజీగా ఉండ‌టంతో మ‌రో ద‌ర్శ‌కుడితో సినిమాను ట్రాక్ ఎక్కించాలని మెగా క్యాంప్ ఆలోచిస్తుంద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై ఓ క్లారిటీ రానుంది.

More News

నాగ శౌర్య , రీతువర్మ జంటగా నూతన చిత్రం ప్రారంభం

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ మరో చిత్ర నిర్మాణానికి సమాయత్తమైంది.

మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేసిన మంచు మ‌నోజ్‌

మంచు మోహ‌న్‌బాబు న‌ట వార‌సులుగా కెరీర్ స్టార్ట్ చేసిన వారు ల‌క్ష్మీ, విష్ణు, మ‌నోజ్‌. వీరిలో మంచు మ‌నోజ్ సినిమా రంగానికి మూడేళ్లుగా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు.

మ‌రోసారి అలాంటి పాత్ర చేయ‌బోతున్న‌ బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి కాంబినేష‌న్‌లో సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత మ‌రో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

సందీప్ కిష‌న్ 'A1 ఎక్స్‌ప్రెస్‌' రిలీజ్ డేట్

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో మంచి విజయం సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. '

'ఆరుద్ర' సెన్సార్‌ పూర్తి, త్వరలో విడుదల

తమిళంలో రచయితగానే కాకుండా నటుడిగా, దర్శకనిర్మాతగా పా.విజయ్ కు మంచి పేరుంది. ఆయన ప్రధాన పాత్రలో