close
Choose your channels

రాజమౌళి వల్ల ఆలస్యమవుతున్న చిరంజీవి చిత్రం

Thursday, February 13, 2020 • తెలుగు Comments

రాజమౌళి వల్ల ఆలస్యమవుతున్న చిరంజీవి చిత్రం

మెగాస్టార్ చిరంజీవి త‌న‌ 152వ చిత్రాన్నికొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సినిమాను ఆగ‌స్ట్ 14 లేదా 15న విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమా విడుద‌ల వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డింద‌ట‌. అందుకు కార‌ణం డైరెక్ట‌ర్ రాజ‌మౌళి అని టాక్‌. ఇంత‌కు చిరంజీవి సినిమాకు, రాజ‌మౌళికి ఏం సంబంధం అని అనుకుంటున్నారా?  వివ‌రాల్లోకెళ్తే.. చిరు 152లో యంగ్ రోల్‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించాల్సి ఉంద‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్‌` సినిమాలో న‌టిస్తున్నాడు.ఈ సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కు మ‌రో సినిమాలో చ‌ర‌ణ్ న‌టించ‌కూడ‌ద‌నేది కండీష‌న్ అట‌. దీంతో చ‌ర‌ణ్ కోసం జూన్‌, జూలై వ‌ర‌కు కొర‌టాల అండ్ టీమ్ వెయిట్ చేయాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి ఎంటైర్ షూటింగ్ వాయిదా ప‌డుతుంద‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.

ఒక‌వేళ చిరు 152వ సినిమా వాయిదా ప‌డితే.. త‌దుప‌రి ఏంట‌నేది చిరు ఇప్ప‌టికే ప్లాన్ చేసేసుకున్నాడ‌ట‌. మ‌ల‌యాళ సినిమా రీమేక్‌లో చిరంజీవి న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసేశాడ‌ట‌. సుకుమార్ ఈ సినిమాను నిజానికి డైరెక్ట్ చేయాల్సింది. కానీ... బ‌న్నీ సినిమాతో సుక్కు బిజీగా ఉండ‌టంతో మ‌రో ద‌ర్శ‌కుడితో సినిమాను ట్రాక్ ఎక్కించాలని మెగా క్యాంప్ ఆలోచిస్తుంద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై ఓ క్లారిటీ రానుంది. 

Get Breaking News Alerts From IndiaGlitz