చిరు సినిమా శాటిలైట్ హ‌క్కులు

  • IndiaGlitz, [Tuesday,October 25 2016]

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం త‌మిళ హిట్ చిత్రం కత్తికి రీమేక్‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఈ సినిమాను నిర్మిస్తుంటే, ఠాగూర్ త‌ర్వాత వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టిస్తున్న చిత్ర‌మిది. ఇప్ప‌టికి సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందే బిజినెస్ పూర్తి అవుతుండ‌టం సినిమాపై ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తుంది. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం సినిమా శాటిలైట్ హ‌క్కులు కూడా భారీ రేటుకు అమ్ముడు పోయాయ‌ట‌. ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్మెంట్ చానెల్ మా టీవీ యాజ‌మాన్యం ఖైదీ నంబ‌ర్ 150 సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను దాదాపు 14 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించి సొంతం చేసుకున్నార‌ని టాక్‌.

More News

న‌వంబ‌ర్ 10న అనంత‌పురంలో ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ‌

న‌వంబ‌ర్ 10న అనంత‌పురంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు స్పెష‌ల్ స్టేట‌స్ సాధ‌న కోసం ప్ర‌తి జిల్లాలో పోరాట స‌భ‌ను జ‌న‌సేన నిర్వ‌హిస్తుంద‌ని తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌లో జ‌న‌సేన సేనాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

బాహుబలి - కాష్మోరా కి ఉన్న తేడా అదే - కాష్మోరా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్

తమిళ హీరో కార్తీ, నయనతార, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా గోకుల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నవంబర్ 1 న 'రెమో' ఆడియో రిలీజ్

శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు విడుదల చేస్తున్నారు.

ఛల్ ఛల్ గుర్రం చిత్ర యూనిట్ ను అభినందించిన పవర్ స్టార్

శైలేష్, దీక్షాపంత్,అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఆర్.ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఛల్ ఛల్ గుర్రం’.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియో, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.

మ‌హేష్ - మురుగుదాస్ మూవీ టైటిల్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. తెలుగు, త‌మిళ్ లో 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది.