close
Choose your channels

చిరు సినిమా శాటిలైట్ హ‌క్కులు

Tuesday, October 25, 2016 • తెలుగు Comments

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ  చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం త‌మిళ హిట్ చిత్రం కత్తికి రీమేక్‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఈ సినిమాను నిర్మిస్తుంటే, ఠాగూర్ త‌ర్వాత వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టిస్తున్న చిత్ర‌మిది. ఇప్ప‌టికి సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందే బిజినెస్ పూర్తి అవుతుండ‌టం సినిమాపై ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తుంది. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం సినిమా శాటిలైట్ హ‌క్కులు కూడా భారీ రేటుకు అమ్ముడు పోయాయ‌ట‌. ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్మెంట్ చానెల్ మా టీవీ యాజ‌మాన్యం ఖైదీ నంబ‌ర్ 150 సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను దాదాపు 14 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించి సొంతం చేసుకున్నార‌ని టాక్‌.