అతని వైపే మొగ్గు చూపుతున్న చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` చిత్రీకరణంతా పూర్తయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరో వైపు చిరు తన 152వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఆగస్ట్ నుండి ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని అంటున్నారు.
కాగా.. ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదినే తీసుకోవాలని చిరంజీవి అనుకుంటున్నాడని వార్తలు వినపడుతున్నాయి. అమిత్ త్రివేది చిరు `సైరా నరసింహారెడ్డి`కి కూడా సంగీతాన్ని అందించారు. ఆ సమయంలో అమిత్ వర్కింగ్ స్టైల్ నచ్చిన చిరు అతని వైపే మొగ్గు చూపుతున్నారట.
అయితే కొరటాల శివ తన సినిమాలన్నింటికీ దేవిశ్రీతోనే పనిచేశాడు. మరి దేవిశ్రీప్రసాద్‌ను కాదని కొరటాల చిరు నిర్ణయానికి ఓకే అంటాడా? లేదా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్ 22న, తన 152వ సినిమా వివరాలను ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారుమరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.