సాయితేజ్ బర్త్‌డే సందర్భంగా చిరు ఆసక్తికర ట్వీట్..

సుప్రీం హీరో సాయితేజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమాలోని 'అమృత' పాటను తాజాగా చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓ పోస్ట్ కూడా చిరు పెట్టారు.

సాయితేజ్ బ్యాచ్‌లర్ లైఫ్‌పై కామెంట్ చేస్తూ చిరు పోస్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది. 'హ్యాపీ బర్త్‌డే ప్రియమైన సాయితేజ్. 'సోలో'గా ఉన్నప్పుడే ఫుల్‌గా ఎంజాయ్ చేయ్. నీ బ్యాచిలర్ లైఫ్ ఇంకొన్ని రోజులే’ అని చిరంజీవి పేర్కొన్నారు. దీంతో సాయితేజ్ పెళ్లంటూ ఇటీవల వచ్చిన వార్తలకు బలం చేకూరింది. ఓ పెద్దింటి అమ్మాయితో సాయి తేజ్ వివాహం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే కావడం విశేషం. కాగా.. సాయితేజ్ వివాహ బాధ్యతను అతని తల్లి తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి అప్పగించినట్టు తెలుస్తోంది.

అయితే ఈ రోజు మెగాస్టార్ చేసిన ట్వీట్‌తో సాయితేజ్ వివాహం ఖాయమైనట్టేనని తెలుస్తోంది. ఇక సాయితే సినిమాల విషయానికి వస్తే.. గతేడాది చివర్లో 'ప్రతి రోజూ పండగే' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో 'సోలో బ్రతుకే సో బెటరు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

More News

అవినాష్ మాస్క్‌ని తొలగిస్తున్నాడా?

నిన్నటి అమితుమీ టాస్క్ ఇవాళ కూడా కంటిన్యూ అయ్యింది. బిగ్‌బాస్ డీల్ ఇస్తారు.

మంత్రి వెల్లంపల్లికి మళ్లీ అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు..

దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నట్టే కోలుకుని తిరిగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

`బ్లాక్డ్` మూవీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

మ‌నోజి నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ ప‌తాకంపై రామ్ లొడ‌గ‌ల ద‌ర్శ‌కత్వంలో

ప్రముఖ సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్..

ప్రముఖ సినీ నటుడు సచిన్ జోషిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్కా అక్రమ రవాణా ఆరోపణలు రావడంతో హైదరాబాద్ పోలీసులు..

మెట్రో స్టేషన్ వద్ద కుంగిపోయిన రోడ్డు.. స్పందించిన మెట్రో రైల్‌ ఎండీ

హైదరాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో వేసిన రోడ్లన్నీ ప్రస్తుతం దారుణంగా దెబ్బ తిన్నాయి.