వై.ఎస్‌.జ‌గ‌న్‌కు చిరు థాంక్స్‌

క‌రోనా ప్ర‌భావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాల్లో సినీ రంగం ముందు వ‌రుస‌లో ఉంది. ఈ రంగాన్ని గాడిలో పెట్ట‌డానికి సినీ పెద్ద‌లు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున‌, సురేశ్‌బాబు, అల్లు అర‌వింద్ స‌హా ఇతరులు అంద‌రూ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను క‌లుసుకుని సినిమా షూటింగ్స్‌కు అనుమ‌తుల‌ను కోరుతున్నారు. అలాగే థియేట‌ర్స్ గురించి త్వ‌ర‌గానే నిర్ణ‌యం తీసుకోమ‌ని కోరుతున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిల‌తో సినీ పెద్ద‌లు బేటీ అయ్యారు.
త్వ‌ర‌లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌ను కూడా చిరంజీవి స‌హా ఇత‌ర పెద్ద‌లు క‌లుసుకోబోతున్నారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా చిరంజీవి త‌న ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్గారు సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు పరిశ్రమ తరుపున వారికి కృతజ్ఞతలు ఫోన్ ద్వారా తెలియచేసాను. లాక్డౌన్ ముగిసిన తరువాత పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని చెప్పారు. అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో త్వరలోనే వారిని కలవటం జరుగుతుంది’’ అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

More News

మే 27న 'అమృతం ద్వితీయం'లో లాక్‌డౌన్‌ స్పెషల్స్‌

లాక్‌డౌన్‌ సమయంలోనూ ప్రజలకు వినోదం అందిస్తున్న ఓటీటీలో అగ్రగామి సంస్థ ‘జీ 5’. ఫీచర్‌ ఫిల్మ్స్‌ డిజిటల్‌ రిలీజులకు శ్రీకారం చుట్టిందీ సంస్థ. ‘జీ 5’లో ‘అమృతరామమ్‌’ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సూర్య‌కు డ‌బ్బింగ్ చెబుతున్న హీరో

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి.

పైర‌సీపై కొత్త చ‌ట్టం రాబోతుందా?

సినిమా ఇండ‌స్ట్రీని చాలా సంవ‌త్స‌రాలుగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య‌ల్లో పైర‌సీ స‌మ‌స్య ఒక‌టి. ఎంత పెద్ద సినిమా అయినా విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే పైర‌సీకి గుర‌వుతుంది.

డిఫరెంట్ కోణంలో ఆది సాయికుమార్ 'బ్లాక్'

మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే మాస్‌క‌మ‌ర్షియ‌ల్ హీరో ఆది సాయికుమార్ హీరోగా, ఆట‌గాడు చిత్రం తో ప‌రిచ‌యమైన ద‌‌ర్శ‌నాబానిక్ ని హీరోయిన్ గా,

టాలీవుడ్‌లో మరో విషాదం.. మిమిక్రీ హరికిషన్ కన్నుమూత

టాలీవుడ్‌ని వరస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇవాళ ఉదయం సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ మరణించారనే వార్త విని 24 గంటలు పూర్తి కాకమునుపే మరో విషాద వార్త వినాల్సి వచ్చింది.