మ‌రోసారి త్రిష‌కు చిరు ఛాన్స్ ఇస్తాడా?

మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ సినిమాలో త్రిష జోడీ క‌ట్టింది. దాని త‌ర్వాత చిరు 152వ చిత్రం ‘ఆచార్య‌’లోనూ జోడీ క‌ట్టాల్సింది. అయితే చివ‌రి నిమిషంలో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త్రిష స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా రీసెంట్‌గా త్రిష పుట్టిన‌రోజుకు చిరంజీవి అభినంద‌న‌లు చెప్పి మ‌ధ్య గ్యాప్‌ను పూర్తి చేశాడు. ఇప్పుడు మ‌రోసారి చిరంజీవి సినిమాలో త్రిష న‌టిస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. చిరంజీవి ‘ఆచార్య‌’ త‌ర్వాత మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’ రీమేక్‌లో న‌టించాల్సి ఉంది. దీనికి సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. దీని త‌ర్వాత చిరు త‌మిళ చిత్రం వేదాళం రీమేక్‌లోనూ న‌టించ‌బోతున్నార‌ని, దానికి మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మెహ‌ర్ దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో లూసిఫ‌ర్ లేదా వేదాళం.. ఈ రెండు రీమేక్స్‌లో ఏదో ఒక‌దానిలో త్రిష‌ను హీరోయిన్‌గా తీసుకునే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న ఈ వార్త‌ల‌పై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో తెలియ‌డం లేదు.మరి నిజంగానే మెగాస్టార్ త్రిషకు ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.

More News

మలయాళ రీమేక్‌లో ప‌వ‌న్‌..?

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టారు.

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

విశాఖ ఎల్‌జీ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది కన్నుమూసిన విషయం విదితమే. తెల్లారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పోలీసులు అప్రమత్తమవ్వడంతో మరణాలు చాలానే తగ్గాయి.

ఈసారి ఖైరతాబాద్ గణపతి ఒక్క అడుగే..!

తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్‌కు ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రూపంలో ఏటికేడు కొత్తదనం సంతరించుకుంటూ కనువిందు చేసే ఈ భారీ గణేశుడిని

'కరోనా' లాక్ డౌన్ 4.0పై తేల్చేసిన మోదీ..!

కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా ఇండియాలో అయితే రోజురోజుకూ కరోనా కేసులు, అనుమానితులు, మరణాలు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.

కష్టకాలంలో 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించిన ప్రధాని

కరోనా కష్టాల్లో ఉన్న భారతీయులను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ అభియాన్’ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ